Gold Price : బంగారం ప్రియులకు షాక్, రూ.47వేలు దాటిన ధర

పసిడి ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. దేశంలో పుత్తడి ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు త‌గ్గుతూ వ

Gold Price : బంగారం ప్రియులకు షాక్, రూ.47వేలు దాటిన ధర

Gold Price

Gold Price : పసిడి ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. దేశంలో పుత్తడి ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు త‌గ్గుతూ వ‌చ్చిన‌ గోల్డ్ ధ‌ర‌లు.. గ‌త రెండు మూడు రోజుల నుంచి వ‌రుస‌గా పెరుగుతున్నాయి. 24 క్యారట్ బంగారం ఇవాళ ఏకంగా రూ.47 వేల మార్కును దాటింది. సోమ‌వారం(ఆగస్టు 16,2021) ఉద‌యం 9.20 గంట‌ల‌కు మ‌ల్టీ క‌మోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్‌) మార్కెట్‌లో అక్టోబ‌ర్ గోల్డ్ కాంట్రాక్ట్‌లు 0.14 శాతం పుంజుకుని 24 క్యార‌ట్‌ పది గ్రాముల బంగారం ధ‌ర‌ రూ.47,006కు చేరింది.

బంగారం ధ‌ర‌లు భ‌విష్య‌త్తులో మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందని బులియ‌న్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘానిస్తాన్ ప‌రిణ‌మాలు దేశంలో బంగారం ధ‌ర పెరగ‌డానికి కార‌ణ‌మ‌య్యే అవ‌కాశం ఉందని అంచ‌నా వేశారు. ఆఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ఆ ప్ర‌భావం అంతర్జాతీయ వాణిజ్యంపై ప‌డుతుంద‌ని, ఆ ఎఫెక్ట్ కొన్ని నెలలపాటు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌న్నారు.

ఆఫ్ఘానిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబ‌న్లు తీసుకోబోయే నిర్ణయాలు గల్ఫ్ దేశాలను ప్రభావితం చేయ‌నున్నాయని, దాంతో చమురు ధరల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. అదే కనుక జ‌రిగితే అంత‌ర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల‌కు లోన‌వుతాయ‌ని, దాంతో మ‌దుప‌రులు సురక్షిత‌మైన‌దిగా భావించి బంగారంపై పెట్టుబడులు పెడుతార‌ని అంటున్నారు. దాంతో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బంగారం ధరలు పరుగులు తీస్తుంటే, వెండి ధ‌ర మాత్రం ఇవాళ త‌గ్గింది. వెండి సెప్టెంబ‌ర్ ఫ్యూచ‌ర్ 0.06 శాతం ప‌డిపోయి కిలో వెండి ధ‌ర రూ.63,203కు త‌గ్గింది.