బంగారం ధర పెరిగింది..ఎంతంటే

  • Published By: madhu ,Published On : July 22, 2020 / 02:06 PM IST
బంగారం ధర పెరిగింది..ఎంతంటే

బంగారం కొనుక్కొవాలని అనుకున్న వారు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే..ధరలు దిగి రావడం లేదు. దీంతో మహిళామణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు 9 ఏళ్ల గరిష్ట స్థాయికి పెరిగిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్ లో బంగారం ధర ఆల్ టైంకి చేరుకుంది. MCX లో 10 gr Gold రూ. 500 పెరిగి..తొలిసారిగా రూ. 50 వేల 026కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ. 47 వేల 090 వద్ద ట్రేడ్ అయ్యింది.

బంగారం బాటలోనే వెండి కూడా వెళుతోంది. ఒక్క రోజులేనే 3 వేల 502 రూపాయలు పెరిగి…ఏకంగా రూ. 60 వేల 844కి పెరిగింది.
హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్ లలో బంగారం ధర (Gold Price) రూ. 130 పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 51 వేల 370కు చేరుకుంది.

ఢిల్లీ మార్కెట్ లో రూ. 50 పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 49 వేల 100, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47 వేల 900కి చేరుకుంది. 1 కేజీ వెండి ధర ధర రూ.55,400కి పైకి ఎగబాకింది.

యూఎస్ – చైనా వాణిజ్య యుద్ధంతో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పసిడి పెట్టుబడికి భారీగా డిమాండ్ ఏర్పడిందని వ్యాపార నిపుణులు వెల్లడిస్తున్నారు. అమెరికా డాలర్ బలహీన పడడం కూడా కారణమంటున్నారు.

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు అమెరికాలో భారీ ప్యాకేజీ ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. తదితర కారణాల వల్ల బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడులు పెడుతున్నారని అంటున్నారు.