Gold Prices Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు..

కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పండుగులు, పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను

Gold Prices Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు..

Gold Prices Today

Gold Prices Today: కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పండుగులు, పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి. పసిడి ధరల్లో రోజురోజుకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతాయి.

తాజాగా బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చే వార్త ఇది. పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్‌లో ఇవాళ 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.271 త‌గ్గి రూ.46,887కు చేరింది. క్రితం ట్రేడ్‌లో తులం నాణ్య‌మైన బంగారం ధ‌ర రూ.47,158 దగ్గర ముగిసింది. అంత‌ర్జాతీయంగా విలువైన లోహాల ధ‌ర‌లు త‌గ్గ‌డ‌మే దేశీయంగా బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.

Cooked Vegetables : ఉడికించిన కూరగాయలు ఆరోగ్యానికి మంచిదేనా?..

ఇక వెండి ధ‌ర‌లు కూడా ఇవాళ స్వ‌ల్పంగా త‌గ్గాయి. ఢిల్లీ మార్కెట్‌లో కిలో వెండి ధ‌ర రూ.687 త‌గ్గి రూ.63,210కి చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.63,897 దగ్గర ముగిసింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1,795 అమెరిక‌న్ డాల‌ర్లు, ఔన్స్ వెండి ధ‌ర 23.89 అమెరిక‌న్ డాల‌ర్లు పలికింది.

ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఇది కేవలం ధరించే ఆభరణమే కాదు సురక్షితమైన పెట్టుబడిగా కూడా ఇన్వెస్టర్లు భావిస్తారు. అందుకే, పుత్తడిని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇక భారతీయులకు అత్యంత ప్రీతికరమైంది గోల్డ్. మహిళలు పసిడికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ధర ఎంత పెరిగినా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం ఆపరు.

Vitamin Deficiency : ఆ.. విటమిన్ లోపిస్తే… మతిమరుపు, గుండె సమస్యలు..!

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల దగ్గరున్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు విశ్లేషించారు.