Gold Rate : బంగారం ధర పరుగులు.. మరింత పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు

వరుసగా రెండు రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.110, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగింది.

Gold Rate : బంగారం ధర పరుగులు.. మరింత పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు

Gold Rates Today In Hyderabad

Gold Rate : వరుసగా రెండు రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.110 పెరిగి రూ.44,300కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగి రూ.48,330కి చేరింది. ఇక వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ. 100 పెరిగి రూ. 67,500 వద్దకు చేరుకుంది. ఇక పెళ్లి ముహూర్తాలకు సమయం ఆసన్నమైంది. దీంతో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.

చదవండి : Gold Rate Today : శుభవార్త.. పది రోజుల తర్వాత దిగొచ్చిన పసిడి ధర

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 46,450 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,670కు చేరింది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,070 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,070కు చేరింది.
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,330 కి చేరింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్లో పసిడి ధర రూ.44,620 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 48,680 కు చేరింది.
విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో ఈరోజు ఉదయం బంగారం ధరలు.. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,330 కు చేరింది.

చదవండి : Gold Rate : గోల్డ్ ల‌వ‌ర్స్‌కి షాకింగ్ న్యూస్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర

వెండి ధర..
ఇవాళ వెండి ధరలలో ఎలాంటి మార్పులు లేదు. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 675కు చేరింది. అలాగే కిలో వెండి ధర రూ. 67,500లకు చేరింది.