Chennai Airport: ఎల్ఈడీ టీవీ స్పీకర్లలో కిలోకు పైగా బంగారం

చెన్నై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో క‌స్ట‌మ్స్ అధికారులకు ఇలాంటి ఓ ప్రయాణికుడ్ని(నేరస్థుడ్ని) పట్టుకుని విచారించగా..

Chennai Airport: ఎల్ఈడీ టీవీ స్పీకర్లలో కిలోకు పైగా బంగారం

Gold Smuggling (1)

Chennai Airport: స్మగ్లింగ్.. ఎలా అయినా బయటపడాలని వేసిన ప్లాన్ వేయకుండా.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త టెక్నిక్ తో ట్రై చేసి దొరికిపోతూనే ఉన్నా ప్రయత్నం ఆపడం లేదు. చెన్నై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో క‌స్ట‌మ్స్ అధికారులకు ఇలాంటి ఓ ప్రయాణికుడ్ని(నేరస్థుడ్ని) పట్టుకుని విచారించగా అతని నుంచి అక్రమంగా తరలిస్తున్న కేజీకి పైగా బంగారం దొరికింది.

ఓపెన్ మార్కెట్లో రూ.57.75 లక్షల విలువ చేసే సుమారు కిలో 200 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడులోని నాగప‌ట్టణానికి చెందిన బ‌ద్రొద్దీన్ (23) అనే యువ‌కుడు దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానం (ఈకే-54)లో చెన్నై విమానాశ్ర‌యంలో దిగాడు.

నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు అధికారులు అత‌డిని అడ్డుకొని సామాగ్రితోపాటు 55 అంగుళాల ఎల్ఈడీని సైతం త‌నిఖీ చేశారు. టీవీ వెనుక క‌వ‌ర్‌ను తొల‌గించి స్పీక‌ర్ల‌లో రెండు భారీ బంగారు క‌డ్డీల‌ను తెలివిగా చొప్పించి తీసుకెళ్తున్న‌ట్లు గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు.