పురీష నాళంలో బంగారం, అవాక్కయిన అధికారులు

పురీష నాళంలో బంగారం, అవాక్కయిన అధికారులు

Kannur airport : బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఎవరికీ తెలియకుండా..బంగారాన్ని తరలించాలని అనుకుంటుంటారు. ఇందుకు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటుంటారు. కానీ..వారి ఆటలను ఎయిర్ ఫోర్స్ అధికారులు కట్టిస్తుంటారు. ఓ వ్యక్తి బంగారం ఎక్కడ దాచాడో తెలుసుకున్న అధికారులు షాక్ తిన్నాడు. ఈ ఘటన కేరళలోని కన్నూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది.

షార్జా నుంచి ఓ ప్రయాణికుడు ఎయిర్ పోర్టులో దిగాడు. తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులకు ఎందుకో అనుమానం కలిగింది. ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అతని పురీశనాళంలో బంగారం ఉందని గుర్తించి అవక్కాయ్యారు. స్వాధీనం చేసుకున్న బంగారం 984 గ్రాములుందని, దీని విలువ రూ. 49 లక్షలు ఉంటుందని అంచాన వేశారు. ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.