Golden Baba : రూ. 5 లక్షలతో గోల్డ్ మాస్క్

బంగారంతో కూడిన మాస్క్ తయారు చేయించుకుని వార్తల్లోకి ఎక్కాడు. స్వచ్చమైన బంగారం తయారు చేసిన ఈ మాస్క్ కు అతను రూ. 5 లక్షలు ఖర్చు చేశాడు. ఇందులో శానిటైజర్ ఉండడం విశేషం. దీనికి శివ శరణ్ మాస్క్ అని పేరు పెట్టారు.

Golden Baba : రూ. 5 లక్షలతో గోల్డ్ మాస్క్

Gold Mask

Rs 5 Lakh Gold Mask : కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి ప్రజలు మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. అయితే..ఓ వ్యక్తి బంగారంతో కూడిన మాస్క్ తయారు చేయించుకుని వార్తల్లోకి ఎక్కాడు. స్వచ్చమైన బంగారం తయారు చేసిన ఈ మాస్క్ కు అతను రూ. 5 లక్షలు ఖర్చు చేశాడు. ఇందులో శానిటైజర్ ఉండడం విశేషం. దీనికి శివ శరణ్ మాస్క్ అని పేరు పెట్టారు.

Manoj Sengar..ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో నివాసం ఉంటారు. ఇతడిని ఈయనకు బంగారం అంటే మక్కువ. బంగారు గొలుసులు వేసుకుని తిరిగే..ఇతడిని…బప్పీ లాహరి, గోల్డెన్ బాబా అని పిలుస్తుంటారు. కరోనా నుంచి రక్షించుకోవడానికి బంగారంతో చేసిన మాస్క్ ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఆర్డర్ కూడా ఇచ్చారు. రూ. 5లక్షలతో బంగారం మాస్క్ తయారు చేయించుకున్నారు. ఇందులో శానిటైజర్ వ్యవస్థ కూడా పొందుపర్చడం విశేషం. దాదాపు ఇది 36 నెలలు పని చేస్తుందంట.

ఇక Manoj Sengar విషయానికి వస్తే…శరీరంపై బంగారం గొలుసులను ధరిస్తుంటారు. 250 గ్రాముల బరువు ఉండే నాలుగు బంగారం గొలుసులను మెడలో వేసుకుని తిరుగుతుంటారు. అంతేగాదు..ఇతని వద్ద బంగారంతో తయారు చేసిన శంఖం, చేప, హనుమంతుడి లాకెట్ ఉంది. ఇవన్నీ మెడలో వేసుకుంటారు. అంతేగాకుండా..ఓ జత బంగారు చెవి రింగులు, అతని వద్దనున్న రివాల్వర్ కు బంగారు కవర్, మూడు గోల్డ్ బెల్ట్ లున్నాయి.

దొంగలు, శత్రువులను నుంచి కాపాడుకోవడానికి ఇద్దరు బాడీగార్డులను నియమించుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విషయానికి వస్తే…క్రమక్రమంగా కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. యాక్టివ్ కేసులు 4 వేలు ఉన్నాయి.