కూల్ రైడ్ : ఏసీ హెల్మెట్ వచ్చేసింది

అవాంతరాల మధ్య గంటల తరబడి ట్రాఫిక్ జామ్ దీంతో ఎండాకాలంలో బైక్‌పై బయటికి వెళ్ళాలంటే బయపడుతున్నారా ?

  • Published By: madhu ,Published On : April 16, 2019 / 12:06 PM IST
కూల్ రైడ్ : ఏసీ హెల్మెట్ వచ్చేసింది

అవాంతరాల మధ్య గంటల తరబడి ట్రాఫిక్ జామ్ దీంతో ఎండాకాలంలో బైక్‌పై బయటికి వెళ్ళాలంటే బయపడుతున్నారా ?

సమ్మర్ లో బైక్ పై వెళ్లాలంటే వాచిపోయింది. బయట ఎండ.. నెత్తిన హెల్మెట్ చమట.. రెండు రకాలుగా రైడర్స్ కు ఇరిటేషన్. ట్రాఫిక్ జామ్ అయ్యిందంటే చాలు.. నరకం కనిపిస్తుంది. దీంతో ఎండాకాలం బైక్ పై వెళ్లాలంటే ఎండ కంటే.. హెల్మెట్ తో వచ్చే చిరాకు ఇబ్బంది పెడుతోంది. బైకర్స్ బాధలు అర్దం చేసుకుంది ‘బ్లూ స్నాప్’ అనే హెల్మెట్ తయారీ కంపెనీ. చల్లటి హెల్మెట్స్ తెచ్చేసింది. ద్విచక్ర వాహనదారుల కోసం ఏసీ హెల్మెట్‌ను రూపొందించారు. దేశంలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం హెల్మెట్ తప్పనిసరి చేసింది. లేకపోతే జరిమానాల మోత. ఎండాకాలంలోనూ తప్పని పరిస్థితుల్లో పెట్టుకోవాల్సిందే.

ఏసీ హెల్మెట్ ఏంటి అనుకుంటున్నారా? 

హెల్మెట్ లో చిన్న కూలర్ అమర్చారు. ఇది చాలా చాలా చిన్నగా ఉంటుంది. హెల్మెట్ ముందుబాగంలో కింది వైపు పరికరాన్ని అమర్చబడి ఉంటుంది. హెల్మెట్ కూలర్‌లో చిన్న ఫ్యాన్, చిన్న వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఇందులోని ఫ్యాన్ గాలిని వాటర్ ఫిల్టర్ గుండా లోనికి పంపిస్తుంది. ఏసీ ఎలా పని చేస్తుందో అలాగే పని చేస్తుంది. వాటర్ ఫిల్టర్ ఎక్కువ సేపు తేమను అలాగే పట్టి ఉంచుతుంది. ప్రతిసారి రిజర్వాయర్‌ను నీటితో నింపు కోవాల్సిన అవసరం ఉండదు. హెల్మెట్ లోపలి గాలిని చల్లగా ఉంచుతుంది దుమ్ము కూడా లోనికి రానివ్వదు. కూలర్ కూడా తక్కువ బరువు ఉంటుంది.

Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్

ఈ హెల్మెట్ కూలర్ వల్ల చల్లటి గాలితో హెల్మెట్ అద్దం మసకబారుతుందని బాధ ఉండదు. హెల్మెట్ కూలర్ మీ తలకు మాత్రమే చల్లదనాన్ని ఇస్తుంది. దీని ధర రూ.2వేల 299. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారా మరెందుకు ఆలస్యం వెంటనే వీటిని విక్రయిస్తున్న వేగ హెల్మెట్ డీలర్స్ షిప్ వెబ్ సైట్‌ను విజిట్ చేయండి సమ్మర్‌లో కూల్‌గా ప్రయాణించండి.

Read Also : మియాపూర్ భూముల జోలికి వెళ్లొద్దు : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం