Narayan Patel: రోడ్లు బాగుండడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయట.. బీజేపీ ఎమ్మెల్యే విచిత్ర వ్యాఖ్యలు

2017లో అమెరికా పర్యటనకు వెళ్లిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్లు అమెరికా రోడ్ల కంటే కూడా బాగున్నాయని అన్నారు. అనంతరం అమెరికా నుంచి తిరిగి వచ్చిన అనంతరం కూడా పలుమార్లు బహిరంగ సభల్లో ఇదే విషయాన్ని వల్లెవేశారు. గతంలో కూడా ఒక బీజేపీ నేత అచ్చం నారాయణ్ చేసిన వ్యాఖ్యలే చేశారు

Narayan Patel: రోడ్లు బాగుండడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయట.. బీజేపీ ఎమ్మెల్యే విచిత్ర వ్యాఖ్యలు

Good Roads Lead To High Speeds says BJP MLA

Narayan Patel: రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రతిరోజు వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు నమోదు అవుతున్నాయి. అయితే ఈ రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల కారణమేంటో కనిపెట్టేశారు భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత, మధ్యప్రదేశ్ అసెంబ్లీ సభ్యుడు నారాయణ్ పటేల్. మంచి రోడ్లు పెరగడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయట. దీనికి ఆయన చెప్పిన లాజిక్ ఏంటంటే.. రోడ్లు బాగుంటే వాహనాల స్పీడ్ పెరుగుతుందని, స్పీడ్ పెరగడం వల్ల వాహనాన్ని కంట్రోల్ చేయడం కష్టమని, ఇలా కంట్రోల్ చేయలేని పరిస్థితి వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని నారణయ్ పటేల్ తేల్చి చెప్పేశారు.

Assam Cm and Shahrukh: షారూక్ ఎవరన్న అస్సాం సీఎం.. అర్థరాత్రి సీఎంకు ఫోన్‌చేసి భద్రత కోరిన షారూక్..

ఆయన నియోజకవర్గమైన ఖాండ్వాలో ఈ మధ్య పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ విషయమై ఆయనను ప్రశ్నించగా ‘‘నా నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు చాలా పెరిగాయి. రోడ్లు బాగున్నాయి, దీంతో వాహనాల స్పీడు పెరిగింది. స్పీడు పెరగడం వల్ల వాహనాల్ని అదుపు చేయడం కష్టమవుతోంది. ఈ సందర్భంలోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో నాకు వ్యక్తిగత అనుభవం ఉంది. అందరూ మద్యం తాగి వాహనాలు నడపరు కదా. వాస్తవానికి చాలా ప్రమాదాలు ఇలా అదుపు తప్పడం వల్లే జరుగుతున్నాయి’’ అని అన్నారు.

Bihar: హిట్ అండ్ డ్రాగ్.. బిహార్‌లో వృద్ధుడిని ఢీకొని 8 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. వృద్ధుడు మృతి

2017లో అమెరికా పర్యటనకు వెళ్లిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్లు అమెరికా రోడ్ల కంటే కూడా బాగున్నాయని అన్నారు. అనంతరం అమెరికా నుంచి తిరిగి వచ్చిన అనంతరం కూడా పలుమార్లు బహిరంగ సభల్లో ఇదే విషయాన్ని వల్లెవేశారు. గతంలో కూడా ఒక బీజేపీ నేత అచ్చం నారాయణ్ చేసిన వ్యాఖ్యలే చేశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక రోడ్లు అందంగా తయారయ్యాయని, అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. కాగా, నారాయణ్ వ్యాఖ్యలపై నెటిజెన్లు మండిపడుతున్నారు. రోడ్లు సరిగా జరిగే ప్రమాదాలు కొన్ని అయితే, ప్రమాదాలు జరిగే విధంగా రోడ్లు వేస్తూ మరింత మంది ప్రాణాలు తీసుకుంటున్నారని కౌంటర్ అటాక్ చేస్తున్నారు.