Good Samaritans: రోడ్ యాక్సిడెంట్ బాధితుల్ని హాస్పిటల్‌కు తీసుకెళ్తే రూ.5వేలు

రోడ్ పై యాక్సిడెంట్ లో గాయాలైన వారిని హాస్పిటల్ వరకూ తీసుకెళ్తే రూ.5వేలు క్యాష్ రివార్డ్ అందించే స్కీమ్ తీసుకొచ్చింది ప్రభుత్వం.

Good Samaritans: రోడ్ యాక్సిడెంట్ బాధితుల్ని హాస్పిటల్‌కు తీసుకెళ్తే రూ.5వేలు

Road Accident

Good Samaritans: రోడ్ పై యాక్సిడెంట్ లో గాయాలైన వారిని హాస్పిటల్ వరకూ తీసుకెళ్తే రూ.5వేలు క్యాష్ రివార్డ్ అందించే స్కీమ్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం రహదారుల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. రోడ్ యాక్సిడెంట్ లో గాయపడిన లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని బతికించేందుకు చేసే ప్రయత్నంలో హాస్పిటల్ కు తీసుకెళ్తే సత్ప్రవర్తన కింద నగదు బహుమతి ఇవ్వాలని ప్లాన్ చేశారు.

అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రిన్సిపాల్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీస్ కు రహదారుల మంత్రిత్వ శాఖ స్కీమ్ గురించి అనౌన్స్ మెంట్ ఇచ్చింది. పైగా ఇది 2021 అక్టోబర్ 15 నుంచి 2026 మార్చి 31వరకూ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. కీలకమైన క్షణాల్లో వారి ప్రాణాలు కాపాడి మెడికల్ ట్రీట్మెంట్ అందించే వారిని సత్కరించాలని నిర్ణయించింది.

‘సత్ప్రవర్తనతో మోటార్ వెహికల్ లేదా మరేదైనా వాహనం కారణంగా యాక్సిడెంట్‌లో గాయపడిన వారిని కాపాడి దగ్గర్లోని హాస్పిటల్/ట్రామా కేర్ సెంటర్ కు తీసుకెళ్లి మెడికల్ ట్రీట్మెంట్ అందించగలిగితే సత్కరించాలనుకున్నాం. అలా చేసిన వారికి ఒక్కో ఘటనకు రూ.5వేలు అందించాలని అనుకన్నాం. నగదుతో పాటు ప్రశంసాపత్రం కూడా ఇస్తాం’ అని అందులో పేర్కొన్నారు.

……………………………………….. : నా సూపర్‌ ఉమెన్‌తో ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది : మహేష్

ఈ క్యాష్ రివార్డు మాత్రమే కాకుండా 10జాతీయ స్థఆయి అవార్డులు కూడా అందచేస్తామని తెలిపింది మంత్రిత్వ శాఖ. అలా టాప్ 10లో నిలిచిన వారికి రూ.లక్ష వరకూ అందజేస్తామని చెప్పారు.