కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి పొడిగింపుపై స్పందించిన సీరం సీఈవో

కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని ప్రస్తుతమున్న 6-8 వారాల వ్యవధిని 12-16 వారాలకు పెంచాలని ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం సిఫారసుకి గురువారం కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి పొడిగింపుపై స్పందించిన సీరం సీఈవో

Adar Poonawalla

Adar Poonawalla కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని ప్రస్తుతమున్న 6-8 వారాల వ్యవధిని 12-16 వారాలకు పెంచాలని ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం సిఫారసుకి గురువారం కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసుల మధ్య వ్యవధిని పెంచడంపై సీరం సీఈఓ అదార్ పూనావాలా సానుకూలంగా స్పందించారు.

కోవిషీల్డ్ డోసుల మధ్య విరామ కాలాన్ని ప్రస్తుతమున్న ఆరు నుంచి 8 వారాల నుంచి 12-16 వారాలకు పెంచడం మంచి నిర్ణయమని పూనావాలా అన్నారు. టీకా సమర్థత, ఇమ్యునోజెనిసిటీ దృక్కోణంలో చూస్తే ఇది ప్రయోజనకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం శాస్త్రీయంగా సరైందని పూనావాలా చెప్పారు. పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ నిర్ణయం కోవిషీల్డ్ ఉత్పత్తిపై పడే ఒత్తిడిని తగ్గిస్తుందని అన్నారు. మరింత ఎక్కువమంది ప్రజలు మొదటి డోసును తీసుకోవడానికి కూడా ఇది ఉపకరిస్తుంది.

కాగా,ప్రారంభంలో కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామం నాలుగు నుంచి ఆరు వారాలు ఉండాలని నిర్దేశించారు. ఆ తర్వాత రెండు డోసుల మధ్య విరామ సమయాన్ని 6 నుంచి 8 వారాలకు పెంచింది కేంద్రం. అయితే ఇటీవలి అధ్యయనం ప్రకారం రెండు డోసుల మధ్య గ్యాప్ 12 నుంచి అంతకంటే ఎక్కువ విరామంలో ఇచ్చిన రెండు డోసుల తరువాత టీకా సామర్థ్యం 81.3 శాతంగా ఉంది. 6 వారాల కన్నా తక్కువ ఉంటే ఇది 55.1 శాతం ఉంటుందని వెల్లడైంది. ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ల మధ్య గ్యాప్‌ పెంచడం ద్వారా టీకా సామర్థ్యం పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ సౌమ్య స్వామినాథన్ ఫిబ్రవరిలోనే వెల్లడించిన విషయం తెలిసిందే.