Sundar Pichai: ఆ మూడు ఓవర్లు కూడా చూశా.. నెటిజన్‌కు అద్దిరిపోయే రిప్లై ఇచ్చిన సుందర్ పిచాయ్

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్‌కు ఒక పాకిస్తానీ రిప్లై ఇచ్చాడు. దీనికి సుందర్ పిచాయ్ తిరిగి ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Sundar Pichai: ఆ మూడు ఓవర్లు కూడా చూశా.. నెటిజన్‌కు అద్దిరిపోయే రిప్లై ఇచ్చిన సుందర్ పిచాయ్

Sundar Pichai: ఇండియాలో జన్మించిన సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో.. ఉన్నత స్థానంలో ఉంటున్నప్పటికీ, ఇండియాపై తన ప్రేమను చాటుకుంటూనే ఉంటారాయన. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన.. విమర్శకులకు పదునైన సమాధానాలివ్వడంలోనూ ముందుంటారు.

Mumbai Businessman: అమ్మాయిని ‘ఐటమ్’ అన్న వ్యాపారి.. జైలు శిక్ష విధించిన కోర్టు

తాజాగా భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఆయన సోమవారం ఉదయం ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో నిన్న జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్ గురించి కూడా ప్రస్తావించారు. దీపావళి శుభాకాంక్షలు చెప్పిన సుందర్ పిచాయ్.. ఆదివారం నాటి మ్యాచులో చివరి మూడు ఓవర్లు మళ్లీ చూస్తూ ఎంజాయ్ చేశానని ట్వీట్ చేశారు. భారత జట్టు గొప్పగా ఆడిందంటూ అభినందనలు తెలిపారు. అయితే, ఈ ట్వీట్‌కు పాకిస్తాన్‌కు చెందిన ముహమ్మద్ షాజైబ్ అనే నెటిజన్ రిప్లై ఇచ్చాడు. మొదటి మూడు ఓవర్లు కూడా చూడాలంటూ సూచించాడు. ఎందుకంటే భారత జట్టు బ్యాటింగ్ చేసిన మొదటి మూడు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Kerala CM: కేరళలో సీఎం వర్సెస్ గవర్నర్.. వీసీల రాజీనామా నిర్ణయంపై కోర్టుకు ప్రభుత్వం

ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు మూడు ఓవర్లలోపే ఔటయ్యారు. అందుకే పాకిస్తాన్‌కు చెందిన నెటిజన్ మొదటి మూడు ఓవర్లు కూడా చూడాలంటూ సూచించాడు. కానీ, దీనికి సుందర్ పిచాయ్ తనదైన రిప్లై ఇచ్చాడు. ‘‘మొదటి మూడు ఓవర్లు కూడా చూశాను. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారు’’ అంటూ పేర్కొన్నాడు. ఈ ట్వీట్లో సుందర్ పిచాయ్ చెప్పింది భారత బౌలింగ్‌లోని మొదటి మూడు ఓవర్ల గురించి. నిజానికి పాక్ నెటిజన్ చెప్పింది భారత బ్యాటింగ్ మొదటి మూడు ఓవర్ల గురించి. కానీ, అతడు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. మొదటి మూడు ఓవర్లు కూడా చూడమన్నాడు కానీ.. అది ఇండియా బ్యాటింగ్‌ చేసిన మొదటి మూడు ఓవర్లు అంటూ స్పష్టంగా పేర్కోలేదు.

Cyclone Sitrang: బలపడుతోన్న సిత్రాంగ్ తుపాను.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన అధికారులు

ఇదే విషయాన్ని గుర్తించిన సుందర్ పిచాయ్.. భారత్ బౌలింగ్ చేసిన మొదటి మూడు ఓవర్లు కూడా చూశానంటూ పాకిస్తానీకి అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. సుందర్ పిచాయ్ రిప్లైకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఇండియన్స్ అయితే, హ్యాపీగా ఫీలవుతున్నారు.