Google Go : స్పేస్ తక్కువ.. స్పీడ్ ఎక్కువ, గూగుల్ గో రికార్డు

Google Go : స్పేస్ తక్కువ.. స్పీడ్ ఎక్కువ, గూగుల్ గో రికార్డు

Play Store

Google Go : గూగుల్ సెర్చ్ కు ప్రత్యామ్నాయంగా..వచ్చిన గూగుల్ గో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొనేందుకు యూజర్లు పోటీ పడుతున్నారు. ప్లే స్టోర్ లో గూగుల్ గో యాప్ 50 కోట్ల డౌన్ లోడ్ లను క్రాస్ చేసింది. రానురాను మరింత మంది డౌన్ లోడ్ చేసుకొనే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. గూగుల్ సెర్చ్ తో పోలిస్తే…ఇది తక్కువ డేటాతో అత్యంత వేగంగా పని చేస్తుందంటున్నారు. 2019 నవంబర్ లో ప్లే స్టోర్ లో గూగుల్ గో 100 మిలియన్ డౌన్ లోడ్ల మార్కును క్రాస్ చేసింది. డేటా ఆదా అవుతుండడం..యాప్ తక్కువ స్పేస్ ను తీసుకోవడం వల్ల గూగుల్ గో యూజర్లు పెరుగుతున్నారని అంటున్నారు.

ఆండ్రాయిడ్ గో డివైజ్‌ల కోసం అభివృద్ధి గూగుల్ గో యాప్ 2017లో సెర్చ్ లైట్‌ పేరిట ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో కస్టమర్లు పరిమితమైన డేటా స్పీడ్ తో ఇంటర్ నెట్ వాడుకుంటుంటారు. ఇలాంటి వారికి గూగుల్ గో యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ యాప్‌ను అభివృద్ధి చేసినప్పటి నుంచి ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఫోన్లలో ఆటోమేటిగ్గా ఇన్‌స్టాల్ చేసి ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ గో ఓఎస్ ద్వారా విడుదలైంది కాబట్టి యాప్ పేరును ‘గూగుల్ గో’ అని మార్చారు.
యాప్ స్టోరేజ్ స్పేస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.

సెర్చ్ రిజల్ట్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు.
దీని స్టోరేజ్ స్పేస్ 7MB మాత్రమే కావడం విశేషం.
కొత్త స్మార్ట్‌ఫోన్ యూజర్లు తప్పనిసరిగా వాడాల్సిన యాప్‌లలో చాలా ఇంపార్టెంట్ అని టెక్ స్పెషలిస్టులు అంటున్నారు.