Google Doodle: ఫెమినిస్ట్ ఫాతిమా షేక్‌ను డూడుల్‌తో సత్కరించిన గూగుల్

ఎడ్యుకేటర్, ఫెమినిస్ట్ ఐకాన్ ఫాతిమా షేక్ పుట్టిన రోజు సందర్భంగా డూడుల్ తో సత్కరించింది గూగుల్. అందులో జ్యోతిరావు, సావిత్రిబాయి పూలెల కాలంలో మహిళా సమాజం కోసం పాటుపడ్డ తొలి ముస్లిం..

Google Doodle: ఫెమినిస్ట్ ఫాతిమా షేక్‌ను డూడుల్‌తో సత్కరించిన గూగుల్

Google Ddodle

Google Doodle: ఎడ్యుకేటర్, ఫెమినిస్ట్ ఐకాన్ ఫాతిమా షేక్ పుట్టిన రోజు సందర్భంగా డూడుల్ తో సత్కరించింది గూగుల్. అందులో జ్యోతిరావు, సావిత్రిబాయి పూలెల కాలంలో మహిళా సమాజం కోసం పాటుపడ్డ తొలి ముస్లిం టీచర్‌గా పేర్కొంది. వారంతా కలిసి 1848లో స్వదేశీ లైబ్రరీని స్థాపించారు. బాలికల కోసం భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి స్కూల్ అదే.

1831లో పుట్టిన ఫాతిమా షేక్.. సోదరుడు ఉస్మాన్‌తో కలిసి దిగువ కులాలైన వారికి విద్య అందించాలని కష్టపడ్డారు. ఆ లైబ్రరీ కూడా ముస్లింల ఇంటిలోనే ఓపెన్ చేశారు. సావిత్రిబాయి పూలె, ఫాతిమా షేక్ లు కలిసి లింగ వివక్ష, మత పద్ధతుల కారణంగా చదువులో వెనుకబడ్డ వారిలో అవగాహన పెంచి విద్యావంతుల్ని చేశారు.

సమానత్వం కోసం ఇంటింటికి తిరిగి తన వర్గంలోని మహిళలను విద్యావంతులను చేశారు. లైబ్రరీతో సాధ్యమైనంత వరకూ ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ నుంచి బయటకు తీసుకురాగలిగారు. అగ్ర కులాల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ ఎదురొడ్డి పోరాడారు. సత్యశోధక్ ఉద్యమంతో నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో తన కమ్యూనిటీ నుంచే వ్యతిరేకత వచ్చింది.

ఇది కూడా చదవండి: నిర్మాతగా, నటుడిగా రమేశ్ బాబు సినిమాలు

ఇండియన్ గవర్నమెంట్ ఆమె సేవలకు గుర్తింపు దక్కాలని ఉర్దూ టెక్స్ బుక్స్ లో 2014లో ఆమె జీవితాన్ని పాఠంగా మార్చారు.