Google Maps: గూగుల్ మ్యాప్‌తో జర్నీ చేయబోయి ఉదయ్‌పూర్‌లో ఇరుక్కుపోయిన జర్మన్లు

గూగుల్ మ్యాప్ లు ప్రియారిటీగా తీసుకుని లొకేషన్ చేరుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. సిటీ ఏరియాల్లో దాదాపు కరెక్ట్ గానే పని చేస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని తంటాలు పడాల్సిందే.

Google Maps: గూగుల్ మ్యాప్‌తో జర్నీ చేయబోయి ఉదయ్‌పూర్‌లో ఇరుక్కుపోయిన జర్మన్లు

Google Maps

Google Maps: గూగుల్ మ్యాప్ లు ప్రియారిటీగా తీసుకుని లొకేషన్ చేరుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. సిటీ ఏరియాల్లో దాదాపు కరెక్ట్ గానే పని చేస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని తంటాలు పడాల్సిందే. అలాగే జర్మన్ టూరిస్టులు వచ్చి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఇరుక్కుపోయారు.

Cartoqఅనే వెబ్ సైట్ లో పబ్లిష్ అయిన కథనం ప్రకారం.. జర్మనీ, ఉత్తరాఖండ్ కు చెందిన టూరిస్టులు.. Grand i10కారులో బయల్దేరి వన్ వే రూట్లోకి వచ్చారు. గూగుల్ మ్యాప్ లో తమ గమ్య స్థానం ఇంకా ముందుంది అంటూ చూపించింది. అదే గుడ్డిగా నమ్ముకుని కారును పోనిస్తూనే ఉన్నారు.

నవానియా హైవే నుంచి గూగుల్ మ్యాప్ లో అడ్రస్ పెట్టుకున్ వారు.. ఫాస్ట్ గా వెళ్లే రూట్ కావాలంటూ ఆల్టర్నేటివ్ రూట్ సెలక్ట్ చేసుకున్నారు. ఊహించిన దానికి భిన్నంగా మారడంతో.. బురదలో ఇరుక్కుపోయారు. వీల్స్ జారిపోతుండటంతో అక్కడే గంటల పాటు సమయం వెచ్చించాల్సి వచ్చింది.

కొద్ది సేపటి తర్వాత టూరిస్టులమని పరిచయం చేసుకుని స్థానికులను సాయం అడిగారు. ఓ ట్రాక్టర్ కు తాళ్లు కట్టి దాంతో కారును వెనక్కు లాగి రూట్ మార్చుకున్న వాళ్లు తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు.

నిజానికి వాళ్లు గూగుల్ మ్యాప్ లో పెట్టుకున్న ఏరియాకు వెళ్లాలంటే కాలినడకన ఇంకో రెండు కిలోమీటర్లు వెళ్లాలి. మరి వీళ్లు ప్రయాణించేది కారులో మరి. అలా బురదలో ఇరుక్కున్న కారు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6గంటల వరకూ వాళ్లను ఎక్కడకు కదలకుండా చేసింది. కారును బయటకు తీసుకోవడానికి ట్రాక్టర్ కు సైతం 2గంటల సమయం పట్టింది.