గూగుల్ ఫొటోస్ ఊరికే రావ్.. డబ్బులు చెల్లించాల్సిందే

గూగుల్ ఫొటోస్ ఊరికే రావ్.. డబ్బులు చెల్లించాల్సిందే

Google Photos: గూగుల్ ఫొటోస్ వైస్ ప్రెసిడెంట్ శిమ్రిత్ బెన్ యైర్ నవంబర్ 11న సంచలనమైన అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటివరకూ అన్‌లిమిటెడ్‌గా ఉన్న గూగుల్ ఫొటోస్ స్టోరేజిని ఇకపై ఉచితంగా అందించడానికి నో చెప్పేసింది.

‘2021 జూన్ 1 నుంచి ఫొటోస్, వీడియోస్ లాంటి అప్ లోడ్ చేసుకోవాలంటే కేవలం 15జీబీ వరకూ మాత్రమే ఉచితం. ప్రతి గూగుల్ అకౌంట్ కు ఇది తప్పనిసరి. అది డ్రైవ్‌లో, జీమెయిల్ లో ఎలా అయినా సరే’



మనం ఇప్పటివరకూ మెమొరీస్ దాచుకునేందుకు గూగుల్ ఫొటోస్ సర్వీసును వాడుకుంటున్నాం. మన ఫొటోలను ఎటువంటి అడ్వర్టైజ్‌మెంట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాడుకోకూడదని కమిట్మెంట్ ఇస్తుంది. అయితే ఇవన్నీ ఇప్పుడు మారనున్నాయి.

ఇందులో ఒక మినహాయింపు కూడా ఉంది. హై క్వాలిటీ ఫొటోలు, వీడియోలు 2021 జూన్ తర్వాత అప్‌లోడ్ చేసుకున్నా అది 15జీబీ క్యాటగిరీలోకి రాదట. దీని కోసం ఫొటోస్ యాప్‌లో బ్యాకప్ అండ్ సింక్రనైజింగ్ లోకి వెళ్లి మార్చుకోవాల్సి ఉంటుంది.

వీడియోలను ఒరిజినల్ క్వాలిటీలోనే ఉంచుకోవాలనుకుంటే ఈ కండిషన్లు ఏమీ వర్తించవు. ఎప్పుడూ ఒరిజినల్ క్వాలిటీలోనే ఫొటోలు, వీడియోలు ఉండాలనుకుంటే 15జీబీ కంటే ఎక్కువగా వాడుకోవచ్చు.

పిక్సెల్ 1-5 ఉన్న ఫొటోలకు పెద్దగా ప్రభావం కనిపించదు. ఇంకా ఆరు నెలలకు పైగా సమయం ఉంది కాబట్టి వెనువెంటనే మనం ఏదో ఒకటి చేసేయాలనుకుని కంగారుపడనవసరం లేదు. జూన్ 21నుంచి ఇది అందుబాటులోకి వచ్చినా సాధారణంగా వాడే వారి స్టోరేజి ఇంకా ఖాళీగానే ఉంటుంది.

ఒకవేళ మీ యూసేజ్ ఎక్కువగా ఉంటే:
మీకు చాలా స్పేస్ కావాలని అనుకుంటే.. గూగుల్ వన్ లో మెంబర్‌షిప్ తీసుకోవాలి. 1.99డాలర్లకు 100జీబీ స్టోరేజి దొరుకుతుందన్న మాట. గూగుల్ ఫొటోస్ లాంచ్ ఐదేళ్లు గడుస్తుంది. యాప్ ఇప్పటికీ 4ట్రిలియన్ ఫొటోలను స్టోర్ చేసుకోగా.. 28బిలియన్ ఫొటోలు, వీడియోలు వారం వారం అప్ లోడ్ అవుతూనే ఉన్నాయి.