#GoogleForIndia2022: ఏఐ పరిశోధనల కోసం ఐఐటీ-మద్రాస్‌కు గూగుల్ రూ.8.26 కోట్లు
కృత్రిమ మేధ(ఏఐ)కు సంబంధించిన అన్ని రకాల పరిశోధనల కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్‌కు రూ.8.26 కోట్లు మంజూరు చేయనున్నట్లు గూగుల్ ఇవాళ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ గ్రాంట్ ఇస్తున్నట్లు చెప్పింది. అలాగే, లాభాపేక్షలేని సంస్థ వాధ్వానీ ఏఐకు కూడా Google.org రూ.8.26 కోట్లు మంజూరు చేయనుందని భారత గూగుల్ పరిశోధనల విభాగ డైరెక్టర్ మనీశ్ గుప్తా చెప్పారు.

#GoogleForIndia2022
#GoogleForIndia2022: కృత్రిమ మేధ(ఏఐ)కు సంబంధించిన అన్ని రకాల పరిశోధనల కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్‌కు రూ.8.26 కోట్లు మంజూరు చేయనున్నట్లు గూగుల్ ఇవాళ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ గ్రాంట్ ఇస్తున్నట్లు చెప్పింది. అలాగే, లాభాపేక్షలేని సంస్థ వాధ్వానీ ఏఐకు కూడా Google.org రూ.8.26 కోట్లు మంజూరు చేయనుందని భారత గూగుల్ పరిశోధనల విభాగ డైరెక్టర్ మనీశ్ గుప్తా చెప్పారు.
పంటలకు వచ్చే వ్యాధుల నివారణ, పంటల దిగుబడి, కిసాన్ కాల్ సెంటర్ వంటి వాటికి ఏఐ మోడల్స్ ను అందించడానికి వాధ్వానీ ఏఐ కృషి చేస్తుందని తెలిపారు. భారత ప్రభుత్వం వ్యవసాయ సంబంధిత ఏఐ అభివృద్ధి, పంట సమస్యల నివారణ కోసం చేపట్టిన అగ్రిస్టాక్ కు కూడా గూగుల్ సాయం చేయనుందని చెప్పారు.
‘గూగుల్ ఫర్ ఇండియా 2022’ కార్యక్రమంలో భాగంగా ఈ సహకారం అందించనున్నట్లు తెలిపారు. ఉపగ్రహ చిత్రాలకు గూగుల్ తమ ఏఐ మోడల్స్ అనుసంధానిస్తుందని, పొలాల సరిహద్దులు వంటి వివరాలను గుర్తించడానికి సహకరిస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన మరిన్ని ప్రణాళికలను అమలు చేస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి గూగుల్ ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కొనసాగిస్తోందని వివరించారు.
పంటల సరిహద్దులు ఎలా మారుతున్నాయి? పంటసాగు పద్ధతులు కొనసాగుతున్న విధానాలు, పంట వ్యర్థాల సమాచారం వంటి అంశాలను కూడా దీని ద్వారా గుర్తించవచ్చని చెప్పారు. గూగుల్ ఇప్పటికే వరదలు, తెగులు వ్యాప్తి వంటి వాటిల్లో సమాచారం అందించేందుకు సహకారిస్తోందని చెప్పారు.
మరోవైపు ‘గూగుల్ ఫర్ ఇండియా 2022’ కార్యక్రమంలో భాగంగా ‘వాణి’ ప్రాజెక్టును కూడా గూగుల్ కొనసాగిస్తోంది. దేశంలోని భాషలు, యాసలు, మాండలికాలు వంటిని అర్థం చేసుకోవడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సహకారంతో దేశంలోని ప్రతి జిల్లా నుంచి భాషకు సంబంధించిన సమాచారాన్ని గూగుల్ సేకరిస్తోంది.
@GoogleIndia announces a grant of 1 million US dollars to @iitmadras for setting up a Centre for Responsible AI. pic.twitter.com/arTebJ797l
— IIT Madras (@iitmadras) December 19, 2022
By providing @WadhwaniAI with this grant, we are enabling them to improve farmer outcomes by providing information on crop disease risks, yield forecasts and much more.#GoogleForIndia pic.twitter.com/CypkN8DzaW
— Google India (@GoogleIndia) December 19, 2022
Chilli Cultivation : ప్లాస్టీక్ ట్రేలలో మిరపనారు పెంపకం, సూచనలు!