దొంగ, పోలీస్ కు ఫొటోషాప్ మాస్క్.. ఫొటో వైరల్

దొంగ, పోలీస్ కు ఫొటోషాప్ మాస్క్.. ఫొటో వైరల్

Gorakhpur police trolled : దొంగ, ఓ పోలీస్ ఉన్న ఫొటోకు ఫొటోషాప్ లో ఎడిట్ చేసిన మాస్క్ ను తగిలించిన వార్త తెగ వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో నెటిజన్లు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గొరఖ్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. భూ వివాద గొడవలో సొంత సొందరుడిని హత్య చేసినందుకు గాను..నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిందితుడితో పాటు కానిస్టేబుల్ ఉన్న ఫొటోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలో ఇద్దరూ మాస్క్ లు ధరించలేదు.

దీనిని గుర్తించిన కొంతమంది కరోనా ప్రొటోకాల్ ను పాటించడం లేదని విమర్శలు గుప్పించారు. వెంటనే పోలీసులకో ఓ ఐడియా వచ్చింది. ఇదే ఫొటోను రీ పోస్టు చేశారు. అందులో ఇద్దరూ మాస్క్ లు ధరించినట్లు ఉంది. కానీ..అది ఫొటోషాప్ లో ఎడిట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంతకుముందు షేర్ చేసిన ఫొటోలు..ఈ ఫొటోను పోలీసులను పదే పదే ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. డిజిటల్ మాస్క్ @ గోరఖ్ పూర్ పోలీసులు అంటూ కామెంట్స చేస్తున్నారు. డిజిటల్ ఇండియాను ప్రోత్సాహించడం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ సెటైర్స్ వేస్తున్నారు. దీనిని గమనించిన పోలీసులు ఆ ఫొటోను వెంటనే డిలీట్ చేశారు.