దేశంలోనే ఫస్ట్ టైం : ఓ ప్రాణం కోసం.. 45 నిమిషాల ముందే వచ్చిన రైలు

ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటాం. స్టేషన్ ముందుగా వెళ్లి ఏం చేస్తాం. ట్రైన్ టైంకు వస్తుందా ఏమైనా? లేటుగా వెళ్తే ఏమౌతుందిలే. ఎందుకంటే రైలు ఎప్పుడు ముందుగా రాదు కదా.

  • Published By: sreehari ,Published On : January 23, 2019 / 10:45 AM IST
దేశంలోనే ఫస్ట్ టైం : ఓ ప్రాణం కోసం.. 45 నిమిషాల ముందే వచ్చిన రైలు

ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటాం. స్టేషన్ ముందుగా వెళ్లి ఏం చేస్తాం. ట్రైన్ టైంకు వస్తుందా ఏమైనా? లేటుగా వెళ్తే ఏమౌతుందిలే. ఎందుకంటే రైలు ఎప్పుడు ముందుగా రాదు కదా.

ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటాం. స్టేషన్ ముందుగా వెళ్లి ఏం చేస్తాం. ట్రైన్ టైంకు వస్తుందా ఏమైనా? లేటుగా వెళ్తే ఏమౌతుందిలే. ఎందుకంటే రైలు ఎప్పుడు ముందుగా రాదు కదా. మీరు ఎక్కాల్సిన రైలు ఓ జీవితకాలం లేటు అనే సామెత ఊరికే పెట్టలేదు పెద్దోళ్లు.. అని లేటు చేశారా? అయితే మీరు ఎక్కాల్సిన ట్రైన్ మిస్సయినట్టే. అన్నీ ట్రైన్లలా కాదు.. ఒక ట్రైన్ మాత్రం ముందే స్టేషన్ కు వచ్చింది. ట్రైన్ ఏంటి.. ముందుగా రావడమేంటి. జోక్ చేస్తున్నారా? అనుకోవద్దు. నిజంగానే ఓ ట్రైన్ షెడ్యూల్ కంటే 45 నిమిషాల ముందే వచ్చింది. అదే గోరఖ్ పూర్- యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్. ఒకటి కాదు.. రెండు నిమిషాలు కాదు.. ఏకంగా 45 నిమిషాల ముందే స్టేషన్ కు చేరుకుంది. అంత తొందరగా రైలు స్టేషన్ రావడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? చదువుతున్న మీరే కాదు.. ప్లాట్ ఫాంపై ప్రయాణికులు కూడా నివ్వెరపోయారు.

 

ఎప్పటిలానే గోరఖ్ పూర్-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ గోరఖ్ పూర్ నుంచి యశ్వంత్ పూర్ కు బయల్దేరింది. మార్గం మధ్యలో ఫజియాబాద్ దాటింది. అంతలో రైల్లో ప్రయాణిస్తున్న చంద్ర అనే వ్యక్తికి సడన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది. అంతే. ట్రైన్ గార్డ్, ట్రైన్ డ్రైవర్, చీఫ్ కంట్రోలర్ అందరూ అప్రమత్తమయ్యారు. ట్రైన్ వేగం పెరిగింది. క్షణాల వ్యవధిలో తరువాతి స్టేషన్ లక్నో లోని చార్ బాగ్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఫజియాబాద్ నుంచి లక్నో చేరుకోవాలంటే.. (రైల్వే మార్గం 135 కిలోమీటర్లు) రైలు టైం ప్రకారం అయితే 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. అయితే గంటా 30 నిమిషాల్లోనే రైలు చేరుకుంది. ఈ రూట్లో గంటకు 80-100 మధ్య వేగం ఉండాలి. రైలు ఎమర్జెన్సీ దృష్ట్యా అధికారులు వేగం పెంచారు. గంటకు 120 – 130 కిలోమీటర్ల వేగంతో.. నాన్ స్టాఫ్ గా వచ్చింది. మధ్యలోని అన్ని సిగ్నల్స్  గ్రీన్ తో వెల్ కమ్ చెప్పాయి. మధ్యలో ఆయా స్టేషన్లలోని రైళ్లన్నింటినీ లూప్ లోకి పంపించారు. ట్రాఫిక్ క్లియర్ చేశారు.

 

గోరఖ్ పూర్-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ షెడ్యూల్ టైమ్ ప్రకారం.. లక్నోకు సాయంత్రం 4 గంటలకు చేరుకోవాలి. 3గంటల 15 నిమిషాలకే లక్నో చార్ భాగ్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అంటే.. 45 నిమిషాల ముందు.. అప్పటికే ప్లాట్ ఫాంపైకి రైల్వే అధికారులతో సహా చేరుకున్న వైద్యులు గుండె నొప్పివచ్చిన ప్రయాణికుడు చంద్రకు వైద్య సాయం అందించారు. రెండున్నర గంటలు చికిత్స అందించగా.. అనంతరం ఆ ప్రయాణికుడు అదే ట్రైన్ లో ప్రయాణించి తన గమ్యాన్ని చేరుకున్నాడు. రైల్వే ప్రయాణికులకు అత్యవసర సేవలు అందించిన రైల్వే అధికారులు మరోసారి తమ ఔదార్యాన్ని ఇలా చాటుకున్నారు.

 

ఇప్పటి వరకు ఇలాంటివి రోడ్లపై జరుగుతుంటాయి. అంబులెన్స్ లో అవయవాలు తరలించే టైంలో.. గ్రీన్ కారిడార్ పేరుతో రోడ్లను క్లియర్ చేస్తుంటారు. ఫస్ట్ టైం రైల్వే చరిత్రలోనే.. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడటం కోసం రైలును అత్యంత వేగంగా.. షెడ్యూల్ టైం కంటే 45 నిమిషాలు ముందుకు స్టేషన్ కు చేరుకోవటం ఇదే అంటున్నారు.