Opposition’s Joint Statement : ప్రభుత్వ అహంకార వైఖరి వల్లే పార్లమెంట్ లో ప్రతిష్ఠంభన..విపక్షాల సంయుక్త ప్రకటన

జాతీయ భ‌ద్ర‌త‌కు సంబంధించిన పెగాస‌స్ స్పైవేర్ ఉదంతంపై పార్ల‌మెంట్ లో చ‌ర్చ జ‌రిపి తీరాల్సిందేనని, హోంమంత్రి అమిషా దీనిపై స‌మాధానం చెప్పాల‌ని 14 విప‌క్ష పార్టీలు డిమాండ్ చేశాయి.

Opposition’s Joint Statement : ప్రభుత్వ అహంకార వైఖరి వల్లే పార్లమెంట్ లో ప్రతిష్ఠంభన..విపక్షాల సంయుక్త ప్రకటన

Rahul (1)

Opposition’s Joint Statement జాతీయ భ‌ద్ర‌త‌కు సంబంధించిన పెగాస‌స్ స్పైవేర్ ఉదంతంపై పార్ల‌మెంట్ లో చ‌ర్చ జ‌రిపి తీరాల్సిందేనని, హోంమంత్రి అమిషా దీనిపై స‌మాధానం చెప్పాల‌ని 14 విప‌క్ష పార్టీలు డిమాండ్ చేశాయి. పెగాస‌స్,వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ు,రైతుల స‌మ‌స్య‌లు స‌హా ప‌లు అంశాల‌పై చర్చను తిరస్కరించడం ద్వారా ప్రభుత్వం “అహంకారపూరితంగా” మరియు “నిర్లక్ష్యం”గా వ్యవహరిస్తోందని..పార్లమెంటులో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ప్రభుత్వానిదే బాధ్యత అని బుధవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో విప‌క్షాలు పేర్కొన్నాయి.

విప‌క్షాల సంయుక్త ప్ర‌క‌ట‌న‌పై 14 పార్టీలకు చెందిన 18 నేతలు సంతకాలు చేశారు. సంతకాలు చేసినవారిలో… కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లిఖార్జ‌న్ ఖ‌ర్గే, ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్, డీఎంకే నేత టీఆర్ బాలు, శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్,కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ,టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్,ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్,టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ,ఆర్జేడీ నేత మనోజ్ ఝా,సీపీఐ నేత బినోయ్ విశ్వమ్,శివసేన నేత వినాయక్ రౌత్,సీపీఎం నేత ఎలామరం కరీం,ఆప్ నేత సుశీల్ గుప్తా,ఎన్సీ నేత మసూది,ఐయూఎంఎల్ నేత మహద్ బషీర్,ఆర్ఎస్పీ నేత ప్రేమ్ చంద్రన్,ఎల్జేడీ నేత శ్రేయమ్స్ కుమార్ ఉన్నారు.

పార్ల‌మెంట్ కార్య‌కలాపాలను విప‌క్షాలు స్తంభింపచేస్తున్నాయ‌ని మోదీ స‌ర్కార్ దుష్ప్ర‌చారం సాగిస్తోంద‌ని విపక్ష పార్టీలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. భ‌గ్గుమన్నాయి. పార్లమెంటులో కొనసాగుతున్న అంతరాయానికి కారణం విపక్ష పార్టీలే కారణమంటూ ప్రభుత్వం నింద వేయడం దురదృష్టకరమని ఉమ్మడి ప్రకటనలో విపక్ష పార్టీలు పేర్కొన్నాయి. విపక్షాలు లేవనెత్తిన అంశాలపై చ‌ర్చించేందుకు మోదీ ప్ర‌భుత్వం మొండిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో పార్లమెంట్ లో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొంద‌ని ఆరోపించాయి.

READ Parliament Insulted : పార్లమెంట్ ని అవమానించారు..విపక్షాలపై మోదీ ఫైర్