Pralhad Joshi : షెడ్యూల్​ ప్రకారమే పార్లమెంట్ సమావేశాలు

సాధారణ షెడ్యూల్​ ప్రకారం జులై నెలలోనే పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు(Monsoon Session)జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు.

Pralhad Joshi : షెడ్యూల్​ ప్రకారమే పార్లమెంట్ సమావేశాలు

Pralhad Joshi

Pralhad Joshi సాధారణ షెడ్యూల్​ ప్రకారం జులై నెలలోనే పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు(Monsoon Session)జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా,కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి పార్లమెంటు సెషన్స్​ కుదించినట్లు పేర్కొన్న ప్రహ్లాద్​ జోషి ..గతేడాది పార్లమెంటు శీతాకాలపు సమావేశాలు రద్దు చేసినట్లు గుర్తు చేశారు.

గతేడాది సాధారణంగా జులైలో ప్రారంభం కావాల్సిన వర్షాకాలం సమావేశాలు సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయని,అయితే ఈసారి యథావిధిగా జరుగుతాయని మంగళవారం జోషి పేర్కొన్నారు. ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి

ఇక,కరోనా సమయంలో తమ తమ నియోజకవర్గాల్లో చేపట్టిన సహాయక చర్యల వివరాలు తెలియచేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలను కోరారు. ఈ మేరకు ఎంపీలందరికీ లేఖ రాశారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పద్ధతులను అభివృద్ధి చేయడానికి ఇది తోడ్పడుతుందని ఓం బిర్లా తెలిపారు.