LIC IPO..చైనా పెట్టుబడులను బ్లాక్ చేసేందుకు కేంద్రం ఫ్లాన్!

భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. లైఫ్‌ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC)త్వరలో ఐపీఓకి రానున్న విషయం తెలిసిందే.

LIC IPO..చైనా పెట్టుబడులను బ్లాక్ చేసేందుకు కేంద్రం ఫ్లాన్!

Lic Ipo

LIC IPO భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. లైఫ్‌ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC)త్వరలో ఐపీఓకి రానున్న విషయం తెలిసిందే. మార్చితో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీలో 5-  10 శాతం వరకు తన వాటా విక్రయించడం ద్వారా రూ. 90,000 కోట్లు సమీకరించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఐపీఓ.. దేశం ఇంతకు ముందెన్నడూ చూడని అతిపెద్ద పెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. అయితే LIC మెగా ఐపీఓలో.. చైనా పెట్టుబడిదారులు షేర్లను కొనుగోలు చేయకుండా బ్లాక్ చేయాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఐపీఓకు వెళ్లిన చాలా ప్రైవేటు సంస్థలలో చైనాకు చెందిన పెట్టుబడిదారులు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఐపీఓలో కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో..ఎల్ఐసీ ఐపీఓలో చైనాకు చెందిన పెట్టుబడులను అనుమతించాలా.. వద్దా.. అనే విషయంలో కేంద్రం ఆలోచిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రభుత్వ యాజమాన్యంలోని LIC..ఓ వ్యూహాత్మక ఆస్థిగా పరిగణించబడుతుంది. 500 బిలియన్ డాలర్లకుపైగా పైగా ఆస్తులను.. 60 శాతానికి పైగా జీవిత బీమా మార్కెట్ ని శాసిస్తోంది. ఈ క్రమంలో 12.2 బిలియన్ డాలర్ల విలువైన దేశపు అతిపెద్ద ఎల్ఐసీ ఐపీఓలో విదేశీ పెట్టుబడిదారులు పాల్గొనేందుకు అనుమతించాలని ప్రభుత్వం యోచిస్తున్నప్పటికీ చైనా పెట్టుబడిదారుల పట్ల కేంద్రం జాగ్రత్తగా ఉన్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. ఎల్ఐసీ వంటి సంస్థలలో చైనా పెట్టుబడులు ప్రమాదాలను కలిగిస్తాయని.. చైనా పెట్టుబడులను ఎలా నిరోధించవచ్చనే దానిపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

కాగా, గతేడాది లడఖ్ లోని గాల్వాన్ వ్యాలీలో సైనిక ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. గల్వాన్ ఘటన నుంచి చైనా పెట్టుబడి కంపెనీలు విషయంలో భారతదేశం ఆచితూచి వ్యవహరిస్తుంది. కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.

READ PM Modi’s Flight : రూటు మార్చిన మోదీ ఫ్లైట్..పాక్ గగనతలం మీదుగా