India Covid Vaccine : కరోనా టీకాలు కేంద్రమే కొనుగోలు చేస్తుందా ?

వ్యాక్సిన్‌ పాలసీపై కేంద్రం పునరాలోచనలో పడింది. టీకాలను కేంద్రమే కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వ్యాక్సిన్ల సేకరణ కోసం ఆయా రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు.

India Covid Vaccine : కరోనా టీకాలు కేంద్రమే కొనుగోలు చేస్తుందా ?

Fm Nirmala

Finance Minister Nirmala Sitharaman : వ్యాక్సిన్ విధానంపై అన్ని రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడంతో… కేంద్రం పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి టీకాలను కేంద్రమే కొనుగోలు చేసిన సరఫరా చేయాలని అన్ని రాష్ట్రాలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి. ఏపీ తెలంగాణ, కేరళ, ఒడిశా సహా వివిధ రాష్ట్రాలు ఈ విషయంలో కేంద్రం వైఖరిని తప్పు పట్టాయి. దీంతో వ్యాక్సిన్‌ పాలసీపై కేంద్రం పునరాలోచనలో పడింది. టీకాలను కేంద్రమే కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

వ్యాక్సిన్ల సేకరణ కోసం ఆయా రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా వ్యాక్సిన్లను సేకరించాలని సుప్రీంకోర్టు సైతం సూచించింది. జూన్ 6 నాటికి రాష్ట్రాలకు 246 మిలియన్‌ డోసులు అందాయి. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 16.3 మిలియన్ డోసులున్నాయి. భారతదేశం ఇప్పటివరకు 233 మిలియన్ వ్యాక్సిన్ డోసులను ఇచ్చింది. డిసెంబర్ నాటికి 2 బిలియన్లకు పైగా టీకాలను సరఫరా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

మరోవైపు టీకా వేగంపై కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రాలను ప్రశ్నించారు. సరఫరా లేకపోవడంతో కేంద్రాన్ని విమర్శిస్తున్నారన్న నిర్మలా .. హెల్త్‌కేర్‌కు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయా రాష్ట్రాలపై మండిపడ్డారు. అంతేకాదు వ్యాక్సిన్ల వృధా విషయంలో ప్రతిపక్షాలపై విరుచుకపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వంలోని పంజాబ్‌, రాజస్థాన్‌లో డస్ట్‌ బిన్లల్లో టీకాల ఎలా దొరికాయని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ చాలా టీకాలు వేస్టెజ్ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More : Viral Pic : ఇంత చిన్న స్కూట‌ర్‌ తీసుకెళ్లటానికి అంత భారీ ట్రాక్కా?! బుర్రా..బుద్ధీ ఉందా?