Covid Guidelines : గుంపులుగా ఉండొద్దు, ప్రయాణాలు వద్దు.. కేంద్రం తాజా కోవిడ్ మార్గదర్శకాలు

కరోనావైరస్ మహమ్మారి ఇంకా దేశాన్ని పూర్తిగా వీడలేదు. ఇంకా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు వెలుగుచూస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా పూర్తిగా కరోనా

Covid Guidelines : గుంపులుగా ఉండొద్దు, ప్రయాణాలు వద్దు.. కేంద్రం తాజా కోవిడ్ మార్గదర్శకాలు

Covid Guidelines

Covid Guidelines : కరోనావైరస్ మహమ్మారి ఇంకా దేశాన్ని పూర్తిగా వీడలేదు. ఇంకా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు వెలుగుచూస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా పూర్తిగా కరోనా ముప్పు తొలగలేదని చెప్పాలి. అదే సమయంలో పండుగ సీజన్ వచ్చేసింది. వరుసగా పండుగలు వస్తున్నాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈ పండుగ సీజన్ లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. 5శాతం కంటే ఎక్కువ కోవిడ్ కేసులున్న జిల్లాల్లో ప్రజలు గుంపులుగా గుమిగూడవద్దని, భౌతిక దూరం పాటించాలని, ఆన్ లైన్ షాపింగ్ చేయాలని, ప్రయాణాలు వీలైనంత వరకు మానుకోవాలని సూచించింది. అన్ని శాఖల సమన్వయంతో కోవిడ్ కట్టడికి కృషి చేయాలని కేంద్రం తెలిపింది.

Amazon లో రూ.70వేల ఖరీదైన ఫోన్ ఆర్డర్‌ చేస్తే అంట్లు తోమే సోప్ పంపారు

మరోవైపు కొద్ది రోజుల్లో దీపావళి పండగ సీజ‌న్ రానుంది. దీంతో క‌రోనా వైర‌స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో మ‌నం ఎండెమిక్ ద‌శ‌కు చేరుకున్నామ‌ని భావించ‌డం త‌గ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. జ‌నాభాలో అత్య‌ధిక మంది వైరస్‌కు వ్య‌తిరేకంగా రోగ నిరోధ‌క శ‌క్తి స‌మ‌కూర్చుకుంటేనే ఏ వ్యాధి అయినా ఎండెమిక్ ద‌శ‌కు చేరిన‌ట్ట‌ని చెప్పారు.

రోగ‌నిరోధ‌క శ‌క్తిని దాటుకుని వ్యాప్తి చెందే కొత్త‌ వేరియంట్ పుట్టుకొస్తేనే భార‌త్‌లో సెకండ్ వేవ్ త‌ర‌హా వేవ్ ముంచెత్తుతుంద‌ని వారు హెచ్చరించారు. అయితే కేసుల త‌గ్గుద‌ల.. వ్యాధి గ్రాఫ్‌లో ఓ భాగం మాత్ర‌మేన‌ని.. బ్రిట‌న్ వంటి దేశాల్లో వైర‌స్ తిరిగి వ్యాప్తి చెంద‌డం వంటి ప‌రిణామాల‌ను ప్రస్తావించిన నిపుణులు.. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. మ‌నం ఎండెమిక్ దిశ‌గా ప‌య‌నిస్తున్నా ఇంకా ఆ ద‌శ‌కు చేర‌లేద‌ని వివరించారు.

Porn : షాకింగ్.. పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ 11ఏళ్ల బాలురు.. దానికి ఒప్పుకోలేదని బాలిక హత్య

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 15వేల 906 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 561 మంది కరోనా బాధితులు మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,72,59 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతుండగా.. ఇప్పటివరకు 102.10 కోట్ల మందికి పైగా టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే నిన్న ఒక్క రోజే 59.97 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 98.17 శాతంగా ఉంది.

చాలా రాష్ట్రాల్లో వెయ్యికి దిగువనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో మాత్రం కోవిడ్ తీవ్రత అధికంగా ఉంది. కేరళలో వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కరోనా బారినపడతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.