పుణ్యం కట్టుకున్నారు : పుల్వామాలో ఇంటర్నెట్ సెంటర్ ఓపెన్

జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా లో విద్యార్దుల కోసం ప్రభుత్వం ఇంటర్నెట్ సెంటర్ ను ప్రారంభించింది. పుల్వామ అదనపు డిప్యూటీ కమిషనర్ మొహద్ అష్రఫ్ హకక్ కార్యాలయంలో ఈ సౌకర్యం కల్పించారు.

  • Published By: chvmurthy ,Published On : September 23, 2019 / 10:37 AM IST
పుణ్యం కట్టుకున్నారు : పుల్వామాలో ఇంటర్నెట్ సెంటర్ ఓపెన్

జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా లో విద్యార్దుల కోసం ప్రభుత్వం ఇంటర్నెట్ సెంటర్ ను ప్రారంభించింది. పుల్వామ అదనపు డిప్యూటీ కమిషనర్ మొహద్ అష్రఫ్ హకక్ కార్యాలయంలో ఈ సౌకర్యం కల్పించారు.

జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా లో విద్యార్దుల కోసం ప్రభుత్వం ఇంటర్నెట్ సెంటర్ ను ప్రారంభించింది. పుల్వామ అదనపు డిప్యూటీ కమిషనర్ మొహద్ అష్రఫ్ హకక్ కార్యాలయంలో ఈ సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా హకక్ మాట్లాడుతూ, “ఈ ప్రాంతంలో బయట ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేనందున విద్యార్థులు ఇక్కడకు  వచ్చి తమకు అవసరమైన సేవలు పొందవచ్చని తెలిపారు.  

పుల్వామాలో ఇంటర్నెట్ పై నిషేధం అమలవుతుండటంతో విద్యార్దులు  వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పరీక్షా ఫారాలను, యుజిసి-నెట్, గేట్, మెయిన్స్ -2, ఐఐటి వంటి పరీక్షలకు ప్రవేశ పత్రాలను నింపడానికి, ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్లు పూర్తి చేసుకోవటం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. దీంతో పలువురు విద్యార్దులు జేఈఈ మెయిన్స్ పరీక్షలకు అప్లయ్  చేసుకున్నారు.

పుల్వామా లోని విద్యార్దులకోసం ప్రభుత్వమే ఇంటర్నెట్ సెంటర్  ప్రారంభించటం సంతోషించదగ్గ  అంశమని తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్దులు తమ విద్యాసంవత్సరాన్ని నష్ట పోకుండా, తమ చదువుకు సంబంధించిన అన్ని పనులు ఇంటర్నెట్ సెంటర్ ద్వారా చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు.

కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన నాటి నుంచి అక్కడ ల్యాండ్ లైన్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపేసింది. 2019, ఆగస్టు 5నుంచి బంద్ అయిన ఈ సౌకర్యాలను ఒక్కొక్కటిగా అక్కడి పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మళ్లీ ప్రారంభిస్తూ వస్తోంది. ల్యాండ్ లైన్, ఫోన్ సేవలు ప్రారంభించినప్పటికీ ఇంకా ఇంటర్నెట్  సదుపాయం ప్రజలకు అందుబాటులోకి రాలేదు. సోషల్ మీడియా ద్వారా పుకార్లు ప్రచారమై కశ్మీర్ లోయలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందన్న అనుమానంతో నెట్ ఇంకా పునరుద్ధరించలేదు.కానీ విద్యార్ధుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని  ప్రభుత్వమే ఇంటర్నెట్ సెంటర్ ను  ప్రారంభించింది.