ఆధార్ నెంబర్.. ఓటీపీలు వీరికి మాత్రం అస్సలు చెప్పొద్దంటోన్న గవర్నమెంట్

ఆధార్ నెంబర్.. ఓటీపీలు వీరికి మాత్రం అస్సలు చెప్పొద్దంటోన్న గవర్నమెంట్

Aadhar

Aadhar OTP: ఉత్తరప్రదేశ్ హెల్త్ డిపార్ట్‌మెంట్.. ఆధార్ కార్డ్ నెంబర్లు, వన్ టైం పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ డిటైల్స్ ఎవ్వరికీ షేర్ చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది. ఎందుకంటే కొవిడ్-19 వ్యాక్సిన్ ఆధార్ నెంబర్ ప్రకారమే ఇస్తుండటంతో ముందుగా ఫోన్లు చేసి ఆధార్ నెంబర్ చెప్పమని.. దాంతో పాటు ఓటీపీని అడుగుతుంటారు. అలా ఇచ్చేస్తే మనకు రావాల్సిన వ్యాక్సిన్ వంతు వాళ్లు కొట్టేస్తారని అధికారులు అంటున్నారు.

గోరఖ్‌పూర్ డిస్ట్రిక్ట్ హెల్త్ అఫీషియల్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇంకా సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీపై ఎటువంటి ప్రకటన చేయలేదు. తొలి దశలో ఫ్రంట్‌లైన్ యాంటీ కొవిడ్ వర్కర్లకు మాత్రమే పంపిణీ చేయనుంది గవర్నమెంట్.

గోరఖ్‌పూర్ సీఎమ్ఓ డా. శ్రీకాంత్ తివారీ మాట్లాడుతూ.. స్టేట్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులమంటూ ఆధార్ కార్డ్ నెంబర్లు, ఓటీపీ కావాలని అడుగుతుంటారు. యాంటీ కొవిడ్ వ్యాక్సిన్ గురించి రిజిష్టర్ చేసుకునేందుకు కచ్చితంగా ఇవ్వాలని చెబుతుంటారు. ‘వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఎటువంటి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.’ అని చెప్పారు.

నేషనల్ డ్రగ్స్ రెగ్యూలేటర్ శుక్రవారం మీటి అవనుంది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా, భారత్ బయోటెక్ కొవిడ్-19 వ్యాక్సిన్లకు అప్రూవల్ ఇచ్చే అంశంపై చర్చిస్తారు. బుధవారం వాళ్ల EUA అప్లికేషన్ పై రివ్యూ మీటింగ్ ఉంటుంది. వారి దగ్గర ఉన్న డేటా సరిపోతుందా మరేైదేనా యాడ్ చేయాల్సి ఉంటుందా అనే దానిపై చర్చిస్తారు.

సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ కోసం విలువైన వివరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జనవరి 2న దేశవ్యాప్తంగా డ్రైరన్ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర, కేరళలో మాత్రం రాజధానిని మినహాయించి ఇతర ప్రధాన నగరాల్లో ఈ డ్రై రన్ పూర్తి చేయనున్నారు.