“లేహ్” చైనాలో ఉన్నట్లు చూపించడంపై ట్విట్టర్ కు భారత్ వార్నింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : October 22, 2020 / 03:33 PM IST
“లేహ్” చైనాలో ఉన్నట్లు చూపించడంపై ట్విట్టర్ కు భారత్ వార్నింగ్

Twitter Settings Showing Leh In China ట్విట్ట‌ర్ సెట్టింగ్స్‌లో…భారత్ లోని “లేహ్” ప్రాంతాన్ని చైనాలో ఉన్న‌ట్లు చూపించడం వివాదంగా మారింది. కేంద్రపాలిత ప్రాంతంలోని లఢఖ్ రాజధాని ‘లేహ్’ పట్టణం చైనాలో ఉన్నట్లు ట్విట్టర్ సెట్టింగ్స్ లో కనిపించడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా,గతంలో కూడా ఒకసారి లేహ్ జియో-లొకేషన్ ను చైనాలో ఉన్నట్లు ట్విట్టర్ చూపించిన విషయం తెలిసిందే.



కాగా, ట్విట్టర్ సెట్టింగ్స్ లో “లేహ్” ప్రాంతాన్ని చైనాలో ఉన్న‌ట్లు చూపిస్తుండటంతో… ట్విట్టర్ కు భారత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సున్నితమైన అంశాలను గౌర‌వించాల‌ని ట్విట్ట‌ర్ కు తేల్చిచెప్పింది. ట్విట్టర్ వైఖరిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన కేంద్రప్రభుత్వం…ట్విట్ట‌ర్ సీఈవో జాక్ డోర్సీకి లేఖ రాసింది. భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను అగౌరవపరిచే ఏ చర్యలైనా, మ్యాప్ ల ద్వారా ఐనా ప్రతిబింబించే చర్యలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదు..చట్టవిరుద్ధం అని ట్విట్టర్ సీఈవోకి రాసిన లేఖలో ఐటీ సెక్రటరీ అజయ్ సహానీ పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇలాంటి ప్రయత్నాలు ట్విట్టర్ ఇలాంటి ప్ర‌య‌త్నాల వ‌ల్ల ట్విట్ట‌ర్ సంస్థ‌కు చెడు పేరు వ‌స్తుంద‌ని, దాని విశ్వ‌స‌నీయ‌త‌పైన కూడా అనుమానాలు వ్య‌క్తం అవుతాయ‌న్నారు.



భారత్ సీరియస్ వార్నింగ్ తో ట్విట్ట‌ర్ సంస్థ స్పందించింది. భార‌త ప్ర‌భుత్వంతో ప‌నిచేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ట్విట్ట‌ర్ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. సున్నిత‌మైన అంశాల‌ను గుర్తిస్తామ‌ని, లేఖ‌ను అందుకున్న‌ట్లు చెప్పారు. ఆదివారం చోటుచేసుకున్న సాంకేతిక స‌మ‌స్య‌ను గుర్తించామ‌న్నారు. జియోట్యాగ్ స‌మ‌స్య‌ను వెంట‌నే గుర్తించి ప‌రిష్క‌రించామ‌న్నారు.



https://10tv.in/ladakh-union-territory-illegally-established-china-after-india-builds-44-bridges-in-border-areas/
కాగా, లేహ్‌లో ప‌లు ప్రాంతాల్లో భార‌తీయ ద‌ళాల‌ ఫార్వ‌ర్డ్ పోస్టులు ఉన్నాయి. ఇటీవల ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌తో పాటు త్రివిధ ద‌ళాల చీఫ్‌లు కూడా లేహ్ ఫార్వ‌ర్డ్ పోస్టుల‌ను సంద‌ర్శించిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది ఆగస్టులో మోడీ సర్కార్… లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల ల‌డాఖ్ స‌రిహ‌ద్దుల్లో చైనాతో స‌రిహ‌ద్దు వివాదం ఉత్ప‌న్న‌మైంది. జూన్ 15న జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు మృతిచెందారు. చైనా జవాన్లు కూడా పెద్ద సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. ఓ వైపు శాంతి చర్చలు అంటూనే…మరోవైపు భారత దళాలపై దాడులకు ప్రయత్నిస్తోంది చైనా. డ్రాగన్ ప్రయత్నాలను భారత జవాన్లు ఎప్పటికప్పుడు ధీటుగా తిప్పికొడుతున్నారు.