కేంద్రం నుంచి మరో ఉద్దీపన ప్యాకేజీ

  • Published By: venkaiahnaidu ,Published On : October 21, 2020 / 06:17 PM IST
కేంద్రం నుంచి మరో ఉద్దీపన ప్యాకేజీ

Government Working On Next Stimulus Package కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్లు ఆర్థికమంత్విత్వశాఖలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కాగా, కరోనా వైరస్, లాక్‌డౌన్ నష్టం నుంచి కోలుకోవడానికి వ్యాపారాలు, కార్మికుల కోసం ఐదు నెలల క్రితం రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీ.. దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (GDP)లో 10 శాతనికి సమానం. ఇది ప్రధానంగా భూమి, శ్రమ, ద్రవ్యత, చట్టాలపై దృష్టి పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ద్రవ్య సడలింపును కూడా కలిగి ఉన్నది.



ఐదు నెలల తర్వాత ఇప్పుడు మరో ఉద్దీపణ ప్యాకేజీ గురించి ప్రకటన చేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ వివిధ మంత్రిత్వశాఖలు,వివిధ రంగాల నుంచి ప్రభుత్వానికి సూచనలు వచ్చాయని ఆర్థికవ్యవహారాల సెక్రటరీ తురుణ్ బజాజ్ వ్యాఖ్యానించారు. మరో ఉద్దీపణ ప్యాకేజీ వచ్చే అవకాశముందని రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇంకా అలాంటి దారులను మూసివేయలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. “మేం ఇప్పుడు జీడీపీ సంకోచంపై అంచనా వేయడం ప్రారంభించాం. మాకు కొంత ఇన్పుట్ సమాచారం వచ్చింది. పార్లమెంటులో లేదా బహిరంగంగా అయినా మేం అంచనా వేయవలసి ఉంటుంది” అని తెలిపారు. 15 వ ఆర్థిక కమిషన్ చైర్‌పర్సన్ ఎన్‌కే సింగ్‌ రచించిన పుస్తకం ఆవిష్కరణ సభలో నిర్మలా ఈ మేరకు వ్యాఖ్యానించారు.



ప్రభుత్వం ఇంకా అలాంటి దారులను మూసివేయలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. “మేం ఇప్పుడు జీడీపీ సంకోచంపై అంచనా వేయడం ప్రారంభించాం. మాకు కొంత ఇన్పుట్ సమాచారం వచ్చింది. పార్లమెంటులో లేదా బహిరంగంగా అయినా మేం అంచనా వేయవలసి ఉంటుంది” అని తెలిపారు. 15 వ ఆర్థిక కమిషన్ చైర్‌పర్సన్ ఎన్‌కే సింగ్‌ రచించిన పుస్తకం ఆవిష్కరణ సభలో నిర్మల సీతారామన్ మాట్లాడారు.