Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీలో రగడ.. వాకౌట్ చేసిన గవర్నర్

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆర్ఎన్ రవి మాట్లాడుతూ.. తమిళనాడు చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాశారని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందంటూ గవర్నర్ రవి అన్నారు. తమిళనాడు అంటే ద్రవిడుల భూమి అన్న ప్రచారం జరిగిందని, తమిళనాడు పేరును తమిళగం అని మార్చాలంటూ పేర్కొన్నారు. దీనిపై డీఎంకే సభ్యులు, మిత్రపక్షాల సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారు.

Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీలో రగడ.. వాకౌట్ చేసిన గవర్నర్

Tamila nadu cm stalin

Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ వర్సెస్ అధికార పార్టీ డీఎంకే మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. అసెంబ్లీలో గవర్నర్ రవి చేసిన ప్రసంగం మరింత వేడిరాజేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని, గవర్నర్ జోడించిన, దాటవేయబడిన భాగాలను తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తరువాత అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారు.

Tamil Nadu : సీఎం సింప్లిసిటీ.. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తికి మాస్క్ తొడిగిన స్టాలిన్

ఇటీవల సీఎం స్టాలిన్, గవర్నర్ ఆర్. రవిలకు మధ్య బేధాభిప్రాయాలు కొనసాగుతున్న విషయం విధితమే. తాజాగా తమిళనాడును శాంతిస్వర్గంగా అభివర్ణిస్తూ లౌకికవాదం, పెరియార్, బీఆర్ అంబేద్కర్, కే. కామరాజ్, సీఎస్ అన్నాదురై, కరుణానిది వంటి నేతల ప్రస్తావనలతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో కొన్ని భాగాలను గవర్నర్ చదవకుండా దాటవేశారని ముఖ్యమంత్రి తీర్మానంలో పేర్కొన్నారు. ఇదిలాఉంటే అధికార డీఎంకే ప్రచారం చేస్తున్న ద్రావిడ మోడల్ ప్రస్తావన కూడా గవర్నర్ చదవలేదని, గవర్నర్ చర్య అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధమని తీర్మానంలో స్టాలిన్ పేర్కొన్నారు. స్టాలిన్ తీర్మానానికి అధికార డీఎంకే మిత్రపక్షాలు, కాంగ్రెస్, విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీఆర్), సీపీఐ, సీపీఐ(ఎం) లాంటి పార్టీలు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించాయి. అసెంబ్లీలో ఆమోదం పొందిన 21 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు డీఎంకే మిత్రపక్షాలు ఆరోపించాయి. గవర్నర్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో నినాదాలు హోరెత్తాయి.

 

 

ఇదిలాఉంటే, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆర్ఎన్ రవి మాట్లాడుతూ.. తమిళనాడు చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాశారని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందంటూ గవర్నర్ రవి అన్నారు. తమిళనాడు అంటే ద్రవిడుల భూమి అన్న ప్రచారం జరిగిందని, తమిళనాడు పేరును తమిళగం అని మార్చాలంటూ పేర్కొన్నారు. దీనిపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంలో అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారు.