Tamil Nadu CM Stalin : గవర్నర్లకు నోరు తప్ప చెవులు లేవు .. రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో వారి జోక్యమేంటీ : సీఎం స్టాలిన్
వర్నర్ల వైఖరిపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లు ఎక్కువ మాట్లాడుతారు..తక్కువ వింటారు అంటూ వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లపై స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో గవర్నర్ల జోక్యంపై స్టాలిన్ అసహనం వ్యక్తంచేశారు.

Tamil Nadu CM Stalin
Tamil Nadu CM Stalin : గవర్నర్ల వైఖరిపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లు ఎక్కువ మాట్లాడుతారు..తక్కువ వింటారు అంటూ వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లపై స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో గవర్నర్ల జోక్యంపై స్టాలిన్ అసహనం వ్యక్తంచేశారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లకి మాట్లాడడానికి నోరు ఉందే తప్ప వినడానికి చెవుల్లేవని ఎద్దేవా చేశారు. ఆన్‌లైన్‌లో జూదం నిరోధక బిల్లుని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి వెనక్కి తిప్పి పంపిన సందర్భంగా సీఎం స్టాలిన్ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఉంగలిల్ ఒరువన్ అనే కార్యక్రమంలో గురువారం పాల్గొన్న స్టాలిన్ ప్రజలు వేసే ప్రశ్నలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాధానాలిస్తూ..రాష్ట్రప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశాలను గవర్నర్నర్లు పాటించాలా? వద్దా అనే ప్రశ్నకు సమాధనమిస్తే స్టాలిన్ ఇప్పటి వరకు గవర్నర్ల తీరును పరిశీలిస్తేవారికి నోరు పనిచేసినట్లుగా చెవులు పనిచేయవని వారు తక్కువ విని ఎక్కువ మాట్లాడుతారు అంటూ సమాధానమిచ్చారు.
కాగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సీఎం స్టాలిన్ కు మధ్య విభేధాలు కనిపించిన విషయం తెలిసిందే. అలాగే పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీ ఏతర పాలన ఉన్న రాష్ట్రాల్లో సీఎంలకు, గవర్నర్లకు మధ్య విభేధాలు వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ, తమిళనాడుల్లో పరిస్థితి అలాగే ఉంది. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ కు ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో కొన్ని పేరాలను స్కిప్ చేసిన ప్రసంగించారు గవర్నర్ రవి. దీనిపై స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగానికి వెలుపల గవర్నర్ రవి ఏం మాట్లాడినా సభ రికార్డుల నుంచి తొలగించాలని తీర్మానించారు.
ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ పై స్టాలిన్ మాట్లాడుతూ..బీజేపీ ప్రతిపక్ష పార్టీలను బహిరంగంగా ఎలా బెదిరిస్తున్నారో చెప్పటానికి ఈ అరెస్ట్ లు ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. రాజకీయ కక్షలతో బీజేపీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందరి విమర్శించారు. మనీష్ అరెస్ట్ ఖండించాల్సిన విషయం అని స్టాలిన్ అన్నారు.