Farmers Protest : రైతుల డిమాండ్లకు కేంద్రం ఓకే..డిసెంబర్-4న ఆందోళన ముగింపు!

నూతన వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రప్రభుత్వం తాజాగా తమ ఇతర డిమాండన్నింటికీ అంగీకరించిందని మంగళవారం రైతు నాయకుడు సత్నామ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక

Farmers Protest : రైతుల డిమాండ్లకు కేంద్రం ఓకే..డిసెంబర్-4న ఆందోళన ముగింపు!

Farmers (2) (1)

Farmers Protest : నూతన వ్యవసాయ చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్రప్రభుత్వం తాజాగా తమ ఇతర డిమాండన్నింటికీ అంగీకరించిందని మంగళవారం రైతు నాయకుడు సత్నామ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక ఏడాదికిపైగా రైతులు చేస్తోన్న నిరసనను కొనసాగించడంలో అర్థం లేదన్నారు. ఉద్యమం విరమించే అంశంపై డిసెంబర్ 4న నిర్ణయం తీసుకుంటామన్నారు.

సత్నామ్ సింగ్ మాట్లాడుతూ… పంటలకు కనీస మద్దతు ధర(MSP)పై చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం ఒప్పుకుందని తెలిపారు. MSP చట్టం కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుందని, ఇందుకోసం ఐదుగురు పేర్లను సిఫార్సు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా(SKM)కు సూచించిందని చెప్పారు.

దీంతో పాటు మరో ప్రధాన డిమాండ్- రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్ర హోంశాఖ లేఖలు పంపిందని సత్నామ్ సింగ్ చెప్పారు. డిసెంబర్4న సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం అవుతుందని.. కమిటీ సభ్యుల పేర్లతో పాటు తదుపరి కార్యాచరణపై అప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇక,మూడు వివాదాస్పద రైతు చట్టాల రద్దు బిల్లుకి సోమవారం పార్లమెంట్ ఆమోదం తెలిసిన విషయం తెలిసిందే.

ALSO READ Omicron : కొత్త వ్యాక్సిన్ అక్కర్లేదు,బూస్టర్ డోస్ రెడీ..సీరం సీఈవో కీలక వ్యాఖ్యలు