EWS కోటాపై రివ్యూకి త్రిసభ్య కమిటీ ఏర్పాటు

ఆర్థికంగా బలహీన వర్గాల(EWS)కేటగిరీ రిజర్వేషన్లకు ఉన్న రూ.8 లక్షల ఆదాయ పరిమితిపై రివ్యూ కోసం త్రిసభ్య కమిటీ

EWS కోటాపై రివ్యూకి త్రిసభ్య కమిటీ ఏర్పాటు

Ews

EWS Reservation: ఆర్థికంగా బలహీన వర్గాల(EWS)కేటగిరీ రిజర్వేషన్లకు ఉన్న రూ.8 లక్షల ఆదాయ పరిమితిపై రివ్యూ కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ మెమోరాండం జారీ చేసింది.

ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ఈ త్రిసభ్య కమిటీ అధిపతిగా ఉండనున్నారు. మూడు వారాల్లోగా నివేదిక అందించాలని కమిటీకి కేంద్రం సూచించింది.

కాగా,EWS ఆదాయ పరిమితిపై పునరాలోచిస్తామని గతవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్ పరీక్షల విషయంలో సుప్రీంలో నమోదైన కేసుపై విచారణలో భాగంగా కేంద్రం ఈ విషయాన్ని తెలిపింది.

ALSO READ  EWS Quota : నీట్- పీజీ కౌన్సెలింగ్ వాయిదా..ఈడబ్యూఎస్ కేటగిరీ గుర్తింపుపై కేంద్రం పునఃసమీక్ష