Dept Of Public Enterprises : ఆర్థిక శాఖకు కొత్త బాధ్యత

మంత్రులతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Dept Of Public Enterprises : ఆర్థిక శాఖకు కొత్త బాధ్యత

Dpe

Dept Of Public Enterprises మంత్రులతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర సహకార శాఖ పేరుతో నూతనంగా ఓ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేంద్రం..తాజాగా ఆర్థిక శాఖలోనూ మార్పులు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

పెట్టుబడుల ఉపసంహరణ కోఆర్డినేషన్ కు బూస్ట్ ఇవ్వడంలో భాగంగా ప్రజా సంస్థల(డిపార్ట్​మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్​ప్రైజెస్)విభాగాన్ని ఆర్థిక శాఖ గొడుగు కిందకు తీసుకొచ్చింది కేంద్రం. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని విభాగాల సంఖ్య ఆరుకి చేరింది. ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, వ్యయ, పెట్టుబడి, ప్రజా ఆస్తుల నిర్వహణ, ఆర్థిక సేవల విభాగాలు ఇప్పటికే ఈ శాఖ పరిధిలో ఉన్నాయి.

ప్రభుత్వ సంస్థలపై నియంత్రణ మెరుగ్గా ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ సంస్థల పెట్టుబడి వ్యయాలు, ఆదాయాలు, ఆర్థిక పరిస్థితిపై పర్యవేక్షణ సులభమవుతుందని తెలిపింది. కాగా,ప్రజా సంస్థల విభాగం ఇప్పటివరకు భారీ పరిశ్రమలు, ప్రజా సంస్థల మంత్రిత్వ శాఖలో అంతర్భాగంగా ఉంది. ఇకపై ఈ శాఖను భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖగా పిలవనున్నారు. 44 సంస్థల బాధ్యత ఈ శాఖపై ఉంది. ఇందులోని చాలా సంస్థలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి.