Ex-gratia : ఉద్యోగి మరణిస్తే పరిహారం వారికే.. కేంద్రం కీలక మార్పు

విధి నిర్వహణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే పరిహారం ఇస్తారనే విషయం తెలిసిందే. కాగా, ఈ పరిహారం చెల్లించే నిబంధనల విషయంలో కేంద్రం మార్పులు చేసింది. ఉద్యోగి బతికుండగా

Ex-gratia : ఉద్యోగి మరణిస్తే పరిహారం వారికే.. కేంద్రం కీలక మార్పు

Ex Gratia Compensation

Ex-gratia Compensation : విధి నిర్వహణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే పరిహారం ఇస్తారనే విషయం తెలిసిందే. కాగా, ఈ పరిహారం చెల్లించే నిబంధనల విషయంలో కేంద్రం మార్పులు చేసింది. ఉద్యోగి బతికుండగా తన కుటుంబంలో ఎంపిక చేసిన నామినీ లేదా నామినీలకు ఇకపై పరిహారం చెల్లించనున్నట్లు తెలిపింది.

కుటుంబసభ్యులందరికి సమానంగా..
ఉద్యోగి బతికుండగా ఎవరినీ నామినేట్‌ చేయకపోయినా.. లేదా నామినీ జీవించి లేకపోయినా.. పరిహారాన్ని కుటుంబసభ్యులందరికీ సమానంగా పంచుతారు. సీసీఎస్‌(పెన్షన్‌) నిబంధనల్లో రూల్‌ 51 ప్రకారం.. గ్రాట్యుటీ విషయంలో అవలంబిస్తున్న విధానాన్నే దీనికీ వర్తింపజేస్తారు.

Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

కుటుంబసభ్యులకు మాత్రమే..
ఉద్యోగి ఎట్టి పరిస్థితుల్లో తన కుటుంబంతో సంబంధం లేని బయటి వ్యక్తిని నామినీగా ఎంపిక చేయడానికి వీలు లేదు. పరిహారాన్ని కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే చెల్లిస్తారు. ఒకవేళ ఉద్యోగికి సొంత కుటుంబమంటూ లేకపోయినా.. బయటి వ్యక్తులను మాత్రం నామినేట్‌ చేయడానికి వీలు లేదు.

Hair Fall : చేప, చక్కర, గుడ్డు తెల్లసొన అధికంగా తింటున్నారా! అయితే అది రావటం ఖాయం?

ఇప్పటివరకు పరిహారం ఎవరికి ఇవ్వాలన్న దానిపై ప్రత్యేక నిబంధనలేమీ లేకపోవడంతో.. సీసీఎస్‌ రూల్స్‌ ప్రకారం ‘ఎక్స్‌ట్రార్డినరీ పెన్షన్‌’కు అర్హులైన వారికి పరిహారాన్ని అందజేస్తూ వచ్చారు. మరణించిన ఉద్యోగి కుటుంబానికి డెత్‌ గ్రాట్యుటీ, జీపీఎఫ్‌ బ్యాలెన్స్‌, సీజీఈజీఐఎస్‌లన్నింటినీ కలిపి ఒకేసారి పరిహారం కింద చెల్లిస్తున్న విషయం తెలిసిందే.