పెన్షన్ రూల్స్ లో భారీ మార్పు…మోడీ సర్కార్ కీలక నిర్ణయం

  • Published By: venkaiahnaidu ,Published On : February 18, 2020 / 04:05 PM IST
పెన్షన్ రూల్స్ లో భారీ మార్పు…మోడీ సర్కార్ కీలక నిర్ణయం

మోడీ సర్కార్ ఇవాళ చారిత్రక నిర్ణయం తీసుకుంది. 01-01-2004 లోపు నియామకాలు ఖరారు చేయబడిన,వివిధ కారణాల వల్ల 01/01/2004న లేదా తరువాత సర్వీస్ లో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చడం ద్వారా మోడీ ప్రభుత్వం ఈ రోజు(ఫిబ్రవరి-18,2020) ఒక మైలురాయి నిర్ణయం తీసుకుంది. మోడీ సర్కార్ నిర్ణయంతో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ కలగనుంది.

01-01-2004కు ముందు నియామకం కోసం ఎంపిక చేయబడి,పరిపాలనా కారణాలు వంటి  వివిధ కారణాలతో 01.01.2004న లేదా తర్వాత సర్వీసులో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇప్పుడు….నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS)కి బదులుగా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 1972 పరిధిలో ఉండాలని ఎంచుకోవచ్చు. 1972 సిసిఎస్ (పెన్షన్) నిబంధనల పరిధిలో ఉండటానికి చాలామంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు కోర్టులను ఆశ్రయిస్తున్న సమయంలో ఇప్పుడు భారత ప్రభుత్వం యొక్క ఈ ఉత్తర్వు అనేక మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రజా వినతులు,పెన్షన్ల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ… 2004 కు ముందు నియమించబడిన భారత ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఉత్తర్వు ఆనందం ఇస్తుందని, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 1972కు ఉద్యోగులు  మారవచ్చు లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో కొనసాగవచ్చు అని తెలిపారు.
 
కొత్త ఆర్డర్

కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఈ ఎంపికను ఉపయోగించుకునే చివరి తేదీ మే-31,2020 అని ఆర్డర్ లో పేర్కొనబడింది. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఈ నిర్ణీత తేదీ ద్వారా ఎంపికను ఉపయోగించుకోవడంలో విఫలమైతే జాతీయ పెన్షన్ వ్యవస్థ పరిధిలోకి వస్తారు. ఈ ఉత్తర్వు ద్వారా కేంద్ర ప్రభుత్వం… 01.01.2004 న లేదా అంతకు ముందు నియామకాలు (వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు ఫలితాల ప్రకటనతో సహా) ఖరారు చేయబడిన భారీ సంఖ్యలో ఉద్యోగుల దీర్ఘకాలిక ఫిర్యాదులను సరిచేసింది(ఇది ఉద్యోగులకు కట్-ఆఫ్ తేదీ పాత పెన్షన్ పథకం కింద కవర్ చేయబడింది).