Sonia Gandhi: వ్యాక్సిన్లను విదేశాలకు పంపి దేశంలో కొరత వచ్చేలా చేశారు – సోనియా

విదేశాలకు ఎగుమతి చేసి దేశంలో కొరత వచ్చేలా చేశారని మోడీ ప్రభుత్వంపై విమర్శలు..

Sonia Gandhi: వ్యాక్సిన్లను విదేశాలకు పంపి దేశంలో కొరత వచ్చేలా చేశారు – సోనియా

Govt Exported Vaccines Allowed Shortage In India Sonia At Congs Review Meet On Covid

Sonia Gandhi: కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ.. కొవిడ్-19 రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ ను విదేశాలకు ఎగుమతి చేసి దేశంలో కొరత వచ్చేలా చేశారని మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టెస్టులు చేసి కేసులను ట్రాక్ చేయడం, వ్యాక్సిన్ చేయడం లాంటి వాటికే ప్రియారిటీ ఇవ్వాలని అన్నారు.

సోనియా గాంధీ తన ట్విట్టర్ అకౌంట్లో టెస్టు, వైరస్ ను ట్రాక్ చేయడం, వ్యాక్సిన్ వేయడం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని పోస్టు చేశారు. కొవిడ్-19 పరిస్థితిపై జరిగిన సమీక్షలో పాల్గొని వ్యాక్సిన్ అందుబాటు గురించి అడిగి తెలుసుకున్నారు. మెడిసిన్లు, వెంటిలేటర్లకు యాక్సెస్ ఇవ్వాలని అన్నారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, పంజాబ్ నాయకులు అమరీందర్ సింగ్, ఛత్తీస్ గడ్ నాయకులు భూపేశ్ బఘేల్ లు మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ.. ‘మోడీ ప్రభుత్వం పరిస్థితిని మేనేజ్ చేయడం కుదరలేదని అన్నారు. వ్యాక్సిన్లు అన్నింటినీ విదేశాలకు ఎగుమతి చేసేసి కొరత ఏర్పడేలా చేశారని అన్నారు.

ఎన్నికల కోసం భారీ గుంపులు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహిడం వల్ల కొవిడ్ ఇంకా పెరిగిపోయింది. సొంత బాధ్యతగా భావించి దేశాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ చీఫ్ అన్నారు. అంతకంటే ముందు రాహుల్ లెటర్ ద్వారా మోడీకి విన్నపాన్ని తెలియజేశారు. వ్యాక్సిన్ ఎగుమతి చేయడంపై మారటోరియం విధించాలని, ఇతర వ్యాక్సిన్లకు కూడా ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్ ఇప్పించాలని అన్నారు.

అంతకంటే ముందు శుక్రవారం.. మోడీ ఏప్రిల్ 11నుంచి 14వరకూ టీకా ఉత్సవ్ ను నిర్వహించాలని చెప్పడంపై మాట్లాడుతూ.. ఇదేమీ పండుగ కాదని సీరియస్ ఇష్యూ అని కామెంట్ చేశారు.