పాన్ తో ఆధార్ లింకు గడువు పొడిగింపు

  • Published By: chvmurthy ,Published On : April 1, 2019 / 03:49 AM IST
పాన్ తో ఆధార్ లింకు గడువు పొడిగింపు

ఢిల్లీ :  పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబరు)ను ఆధార్ తో అనుసంధానం చేసుకోడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం మరోసారి గడువు పొడిగించింది.  వాస్తవానికి ఈ గడువు ఇంతకు ముందు ప్రకటించిన దాని ప్రకారం మార్చి 31తో ముగిసింది.  కాని దీన్ని మరో 6 నెలలపాటు పొడిగించారు, అంటే   సెప్టెంబరు 30లోపు  వినియోగదారులు పాన్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవచ్చు.

ఇకపై ఆదాయపన్ను రిటర్న్ ధాఖలు చేసేవారు తప్పని సరిగా ఆధార్ నెంబరు నుకూడా  పొందు పరచాలని సూచించింది.  ఈ నిబంధన ఏప్రిల్ 1 ,2019 నుంచి అమల్లోకి వస్తుంది. ఆధార్ రాజ్యాంగ బద్ధమేనని, ఐటీ రిటర్న్స్  దాఖలు చేసేవారు తప్పని సరిగా  ఆధార్ నంబర్ను  పొందుపరచాలని గత ఏడాది సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు స్పృష్టం చేసింది.