IT Returns: ఐటీ రిటర్స్‌కు గడువు పొడిగించిన కేంద్రం

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయడానికి మరోసారి గడువు పెంచింది కేంద్రం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన ఐటీ రిటర్న్స్ 2022 మార్చి 15లోగా చెల్లించవచ్చని...

IT Returns: ఐటీ రిటర్స్‌కు గడువు పొడిగించిన కేంద్రం

It Returns

IT Returns: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయడానికి మరోసారి గడువు పెంచింది కేంద్రం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన ఐటీ రిటర్న్స్ 2022 మార్చి 15లోగా చెల్లించవచ్చని రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ లో ఆర్థిక శాఖ వెల్లడించింది. అనూహ్యంగా గడువు ముగిసిన 10 రోజుల తర్వాత ఐటీ రిటర్న్స్ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విశేషం.

‘ట్యాక్స్ పేయర్స్/ స్టేక్ హోల్డర్స్ లు కొవిడ్ కారణంగా ఆడిట్ రిపోర్ట్స్ ఈ-ఫైలింగ్ చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో గడువు తేదిని పొడిగించాం’ అని ఐటీ శాఖ ట్వీట్ లో వెల్లడించింది.

ఐటీ రిటర్న్స్ చెల్లించడానికి గడువు తేదీని ఇప్పటివరకూ ఐదుసార్లు పొడిగించారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. మొట్టమొదటగా 2021 సెప్టెంబర్ 30గా ఉంది. కొవిడ్, టెక్నికల్ కారణాల రీత్యా పొడిగించిన ఐటీ శాఖ ఎట్టకేలకు 2022 మార్చి 15వరకూ పొడిగిస్తూనే వచ్చింది.

ఇది కూడా చదవండి : ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా కలకలం