ఐటీ ఉద్యోగులు డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్

  • Published By: murthy ,Published On : July 22, 2020 / 12:11 PM IST
ఐటీ ఉద్యోగులు డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్

దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్ననేపధ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నాయి. ఐటీ, బీపీవోలతో సహా అవకాశం ఉన్న పలు వాణిజ్య సంస్దలు ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాయి.
తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.

ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్  విధానాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్  విధానాన్ని పొడిగించింది. గతంలో ప్రకటించిన వర్క్ ఫ్రమ్ హోమ్  గడువు జులై 31తో ముగుస్తుంది.

ప్రజల్లో కరోనా వైరస్ పట్ల నెలకొన్న భయం కారణంగా వారు ఇంటి నుంచే పని చేసే విధానాన్ని ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ సర్వీసు ప్రోవైడర్లకు నిబంధనలు,షరతులతో డాట్ సడలింపులు ఇచ్చిందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ట్విట్టర్ లో పేర్కోంది. దేశంలో 85 శాతం ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే ఆఫీసులకు వచ్చి పని చేస్తున్నారు.