MSP For Kharif Crops : ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు

2021-22 ఏడాదికి ఖరీఫ్​ పంటల కనీస మద్దతు ధర పెంచడానికి బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

MSP For Kharif Crops : ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు

ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు

MSP For Kharif Crops 2021-22 ఏడాదికి ఖరీఫ్​ పంటల కనీస మద్దతు ధర పెంచడానికి బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. క్వింటా ధాన్యం ధరను రూ.72 పెంచి రూ.1,940గా నిర్ణయించింది. 2020-21లో ఈ ధర రూ.1,868 ఉండేది. వ‌రితో పాటు ఇత‌ర ఖ‌రీఫ్ పంట‌ల రేట్ల‌ను కూడా ప్ర‌భుత్వం పెంచింది.

కేబినెట్ సమావేశం అనంత‌రం కేంద్ర వ్యవసాయశాఖ‌ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ..క్వింటా నువ్వుల కనీస మద్దతు ధర(MSP) రూ.452 మేర పెంచినట్లు చెప్పారు. క్వింటా కంది, మినుముల కనీస మద్దతు ధర ఒక్కొక్కటి రూ.300 మేర పెంచినట్లు తోమర్ తెలిపారు. వేరుశనగ 275, కుసుమల ధరను రూ.235 రూపాయలు పెంచినట్లు తెలిపారు. హైబ్రిడ్ జొన్న మద్దతు ధరను రూ.2620 నుంచి రూ.2738 రూపాయలకు పెంచారు. దేశీరకం జొన్నల ధర రూ.2640 నుంచి రూ.2,758కి పెంచారు. స‌జ్జ‌లు క్వింటాల్‌కు గ‌తేడాది రూ.2,150 ఉండ‌గా దానిని ఇప్పుడు రూ.2,250కి పెంచారు.

ఇప్పటి వరకు క్వింటాల్ రాగుల మద్దతు ధర రూ.3295 ఉండగా..దానిని రూ.3377కి పెంచారు. మొక్కజొన్న మద్దతు ధరను రూ.1850 నుంచి రూ.1870కి పెంచారు. పెసర్ల ధర రూ. 7196 నుంచి 7275కి పెంచారు. వేరుశనగల ధర గతంలో 5275 ఉండగా.. ఇఫ్పుడా ధర రూ.5550కి చేరింది. పొద్దుతిరుగుడు ధర రూ.5,885 ఉండగా.. 6015కి పెంచారు. ఇక సోయాబీన్ (పసుపు రంగు) ధరను రూ.3880 నుంచి 3950కి పెంచారు. పత్తి (సాధారణ రకం) మద్దతు ధరను రూ.5515 నుంచి రూ.5726కి పెంచారు. పత్తి (పొడవాటి రకం) ధర రూ. 5825 నుంచి రూ.6025కి పెంచారు.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరియు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ రైతులు ధర్నా కొనసాగుతున్న సమయంలో..క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌పై ఉన్న రైతుల భ‌యాల‌ను తొల‌గించిన‌ట్లు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. పంట‌ల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా మ‌ద్ద‌తు ధ‌ర‌లు పెరుగుతూనే ఉంటాయ‌ని వారి ఫ‌లితాలు రైతుల‌కు అంద‌నున్న‌ట్లు కేంద్ర‌మంత్రి పేర్కొన్నారు.