Mera Ration Mobile App : కొత్త ‘మేరా రేషన్’ మొబైల్ యాప్.. ఎలా వాడాలి? ఫీచర్లు ఏంటి?

దేశంలో ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డు సిస్టమ్‌’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మొబైల్ యాప్ ప్రవేశపెట్టింది. అదే.. మేరా రేషన్ యాప్.. ఈ కొత్త యాప్ ద్వారా రేషన్ కార్డుదారులు దేశంలో ఎక్కడనుంచైనా సులభంగా రేషన్ తీసుకోవచ్చు.

Mera Ration Mobile App : కొత్త ‘మేరా రేషన్’ మొబైల్ యాప్.. ఎలా వాడాలి? ఫీచర్లు ఏంటి?

Mera Ration Mobile App

Mera Ration Mobile App : దేశంలో ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డు సిస్టమ్‌’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మొబైల్ యాప్ ప్రవేశపెట్టింది. అదే.. మేరా రేషన్ యాప్.. ఈ కొత్త యాప్ ద్వారా రేషన్ కార్డుదారులు దేశంలో ఎక్కడనుంచైనా సులభంగా రేషన్ తీసుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుంటారు. అలాంటి సందర్భాల్లో రేషన్ దారులు కొత్త ప్రాంతంలో రేషన్ పొందేందుకు వీలుగా కేంద్రం ఈ కొత్త మొబైల్ యాప్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ మేరా రేషన్ యాప్ ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంలో మాత్రమే అందుబాటులో ఉంది.

దేశంలోని 69 కోట్ల నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (NFSA) లబ్దిదారులకు అందేలా కేంద్రం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ NFSA స్కీమ్ కింద ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా 81 కోట్ల మందికిపైగా ప్రజలకు ఆహారధాన్యాలపై కిలోకు రూ.1 నుంచి రూ.3ల రాయితీతో అందిస్తోంది. ఈ రేషన్ కార్డు పోర్టబిలిటీ సర్వీసు (ONORC) 32 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంత ప్రజలకు వర్తిస్తుంది. కొత్త ‘మేరా రేషన్’ యాప్ ఇంతకీ ఎలా వాడాలి? అందులో ఎలాంటి ఫీచర్లు, బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం..

Ration Cards

మేరా రేషన్ యాప్ అంటే ఏంటి? :
రేషన్ కార్డు లబ్దిదారులకు ONORC సంబంధిత సర్వీసు అందించేందుకు కొత్త మేరా రేషన్ యాప్ ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా లబ్దిదారులు సమీపంలోని రేషన్ షాపులను గుర్తించవచ్చు. అలాగే అక్కడి ధరల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. యాప్ ను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) డెవలప్ చేయగా.. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే అప్లికేషన్ అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో మరో 14 వివిధ భారతీయ భాషల్లో కూడా ఈ యాప్ అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.

ఎలా వాడాలి? :
ఈ కొత్త మేరా రేషన్ మొబైల్ యాప్ ద్వారా లబ్దిదారులు.. తమ కార్డు యాక్టివ్ గా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. (ఫుడ్, సివిల్ సప్లయిస్ అండ్ కంజ్యూమర్ అఫైర్స్ డిపార్ట్ మెంట్) వెబ్‌సైట్ ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
– మీ మొబైల్‌లో గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లండి. సెర్చ్ బార్‌లో Mera Ration అని టైప్ చేయండి.
– మేరా రేషన్ యాప్ (CENTRAL AEPDS TEAM) డౌన్ లోడ్ చేసుకోండి.
– ఇన్ స్టాల్ చేశాక మీ రేషన్ కార్డుతో రిజిస్ట్రర్ చేసుకోండి.
– రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.
– మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి.
– Submit బటన్ పై క్లిక్ చేయండి.
– Know your entitlement option ఆప్షన్ ద్వారా కూడా రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు.
– మీ రేషన్ కార్డు నెంబర్ లేదా ఆధార్ కార్డు నెంబర్ ద్వారా entitlement చెక్ చేసుకోవచ్చు.

యాప్ ఫీచర్లు, బెనిఫిట్స్ ఏంటి? :
– యాప్ రిజిస్ట్రేషన్ తర్వాత సిస్టమ్ ద్వారా ఆహార ధాన్యాలను ఆటోమాటిక్‌గా కేటాయిస్తుంది.
– foodgrains entitlement స్టేటస్‌ను NFSA లబ్దిదారులు చెక్ చేసుకోవచ్చు.
– గత 6 నెలల ట్రాన్సాక్షన్లు, ఆధార్ కార్డు సీడింగ్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు.