Cyber Crime Helpline Number : సైబర్‌ మోసమా..? వెంటనే ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి.. మీ డబ్బుని కాపాడుకోండి..

దేశవ్యాప్తంగా సైబర్‌ మోసాలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది.

Cyber Crime Helpline Number : సైబర్‌ మోసమా..? వెంటనే ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి.. మీ డబ్బుని కాపాడుకోండి..

Cyber Crime Helpline Number

Cyber Crime Helpline Number : దేశవ్యాప్తంగా సైబర్‌ మోసాలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. కస్టమర్లు తమ ఖాతాల్లోని డబ్బులు పోయినట్లు గుర్తించిన వెంటనే ఫిర్యాదు చేసేందుకు నేషనల్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 155260ను ఏర్పాటు చేసింది. సైబర్‌ మోసం కారణంగా ఆర్థిక నష్టాన్ని నివారించడానికి, ఆ తర్వాత బాధితుల ఫిర్యాదును స్వీకరించడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. వినియోగదారులకు సురక్షితమైన డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను అందించడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ ఉపయోగపడనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1న హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు.

హెల్ప్‌లైన్‌తో పాటు ఫిర్యాదుల స్వీకరణను హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌(I4C) నిర్వహిస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అన్ని ప్రధాన బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులు, వాలెట్లు, ఆన్‌లైన్‌ మర్చంట్ల సహకారం, మద్దతుతో హెల్ప్‌లైన్‌ను నిర్వహించనున్నారు. సైబర్‌ మోసగాళ్ల బారినపడిన వారు వెంటనే ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే నష్టపోయిన డబ్బును త్వరగా వెనక్కి రప్పించడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతానికి ఈ నెంబర్ ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో(Chhattisgarh, Delhi, Madhya Pradesh, Rajasthan, Telangana, Uttarakhand and Uttar Pradesh) అందుబాటులో ఉంది. త్వరలోనే దేశం మొత్తం అందుబాటులోకి రానుంది. కేంద్రం తెలిపిన గణాంకాల ప్రకారం.. 155260 హెల్ప్ లైన్ ద్వారా రూ.కోటి 85లక్షలు సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా చేయగలిగారు. ఢిల్లీ రూ.58లక్షలు, రాజస్తాన్ రూ.53లక్షలు సేవ్ చేయగలిగాయి.

హెల్ప్ లైన్ నెంబర్.. పని చేసే విధానం..

* సైబర్ క్రైమ్ బారిన పడిన బాధితులు 155260 హెల్ప్ లైన్ నెంబర్ కి ఫిర్యాదు చేయాలి.
* వెంటనే పోలీసులు కాలర్ వివరాలు నమోదు చేసుకుంటారు. ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ వివరాలు, కాలర్ ప్రాథమిక వ్యక్తిగత సమాచారం తీసుకుంటారు. ఆ తర్వాత ఓ టికెట్ రూపంలో సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లో సబ్మిట్ చేస్తారు.
* ఆ టికెట్ సంబంధిత బ్యాంకులు, వాలెట్లు, మర్చంట్లకు వెంటనే పంపుతారు.
* అలాగే బాధితుడికి అక్ నాల్డెజ్ మెంట్ నెంబర్ ఎస్ఎంఎస్ పంపుతారు. అందులో ఫిర్యాదు నెంబర్ ఉంటుంది. దాని ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (https://cybercrime.gov.in/) లో 24 గంటల్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
* సంబంధిత బ్యాంకు దాని యొక్క రిపోర్టింగ్ పోర్టల్ లో టికెట్ ను చూడగలదు.
* ఫ్రాడ్ కు గురైన డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే.. వెంటనే బ్యాంకు ఆ డబ్బుని హోల్డ్ లో ఉంచుతుంది. ఆ విధంగా సైబర్ నేరస్తుడు డబ్బుని విత్ డ్రా చెయ్యకుండా ఆపుతుంది.
* ఒక వేళ ఫ్రాడ్ చేసిన మనీ మరో బ్యాంకుకి వెళ్లిపోయి ఉంటే.. ఏ బ్యాంకుకి అయితే డబ్బు చేరి ఉంటుందో.. ఆ బ్యాంకుకి టికెట్ వెళ్తుంది.
* డబ్బు సైబర్ క్రిమినల్స్ అందకుండా ఉండేవరకు ఇలా ఈ ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది.
* ప్రస్తుతం హెల్ప్ లైన్, రిపోర్టింగ్ ప్లాట్ ఫామ్.. అన్ని ప్రధాన పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల ఆన్ బోర్డులో అందుబాటులో ఉంది.
* State Bank of India, Punjab National Bank, Bank of Baroda, Bank of India, Union Bank, IndusInd, HDFC Bank, ICICI Bank, Axis Bank, Yes Bank and Kotak Mahindra Bank(ఈ బ్యాంకుల ఆన్ బోర్డులో రిపోర్టింగ్ ప్లాట్ ఫామ్ ఉంది..)
* అంతేకాదు అన్ని ప్రధాన ఆన్ లైన్ వ్యాలెట్స్, మర్చంట్స్(PayTM, PhonePe, Mobikwik, Flipkart and Amazon) హెల్ప్ లైన్ నెంబర్ కి లింక్ అయి ఉన్నాయి.