MSP Price: “కనీస మద్దతు ధర” అంశంపై అతిత్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం

కనీస మద్దతు ధర (MSP) నిర్ణయించేలా పలు అంశాలపై అధ్యయానికి అతి త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు

MSP Price: “కనీస మద్దతు ధర” అంశంపై అతిత్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం

Tomar

MSP Price: దేశంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని..అందులో భాగంగా కనీస మద్దతు ధర (MSP) నిర్ణయించేలా పలు అంశాలపై అధ్యయానికి అతి త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. మంగళవారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గతేడాది నవంబర్లో ప్రధాని మోదీ మూడు రైతు చట్టాలను రద్దు చేస్తూ..పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి అత్యంత పారదర్శకంగా మరింత ప్రభావవంతమైన ధరను నిర్ణయించనున్నట్లు మోదీ ప్రకటించారు.

Also read:Jana Gana Mana: విజయ్ జనగణమన.. పవన్-మహేష్ ఎందుకు వద్దనుకున్నారు?

అయితే కరోనా, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అప్పటికపుడు కమిటీ ఏర్పాటు చేయలేకపోయామని..ఇక అతిత్వరలో కమిటీ ఏర్పాటు చేసి MSPని నిర్ణయించనున్నట్లు కేంద్ర మంత్రి తోమర్ లోక్‌సభకు స్పష్టం చేశారు. దేశంలో సున్నా బడ్జెట్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు మరింత లాభం చేకూర్చేలా బీజేపీ ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తుందని తోమర్ పేర్కొన్నారు. “పంటల పద్ధతిని మార్చడానికి, MSPని మరింత ప్రభావవంతంగా మరియు పారదర్శకంగా రూపొందించడానికి మరియు సహజ వ్యవసాయ పద్ధతిని ప్రోత్సహించడానికి, ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నాం”అని తోమర్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు.

Also read:Chandrababu On Youth Seats : వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌కు 40శాతం సీట్లు.. చంద్రబాబు కీలక ప్రకటన

ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తల ప్రతినిధులు ఉండనున్నారు. కాగా దేశ వ్యాప్తంగా పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ గత కొంతకాలంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో రైతులకు మరింత మేలు జరుగుతుందని భావించిన భాజపా సర్కార్ ఆ చట్టాలపై రైతుల్లో అవగాహనా కల్పించడంలో విఫలమైంది. దీంతో గత నవంబర్లో మూడు రైతు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంది.

Also read:Hero Motors: రూ.వెయ్యి కోట్ల బోగస్ ఖర్చులు లెక్కలో చూపని హీరో సంస్థ