ఏప్రిల్ 15 నుంచి విమాన ప్రయాణాలు డౌటే..

ఏప్రిల్ 15 నుంచి విమాన ప్రయాణాలు డౌటే..

జనతా కర్ఫ్యూ అనంతరం దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ట్రాన్స్ పోర్ట్ సర్వీసులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ క్రమంలో రైళ్లు టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు వాపస్ ఇచ్చేస్తామని చెప్పగా.. విమాన సర్వీసులు మాత్రం భవిష్యత్ లో అదే డబ్బుతో జర్నీ చేయొచ్చని చెప్పాయి. మరి ఏప్రిల్ 14తో లాక్‌డౌన్ ముగుస్తుండగా 15వ తేదీ నుంచి ఆ టిక్కెట్లు పని చేస్తాయా.. అసలు విమానాలు ప్రయాణిస్తాయా అనే సందేహాలు లేకపోలేదు. 

ప్రభుత్వం ఏప్రిల్ 14తర్వాత నుంచి కచ్చితంగా లాక్ డౌన్ ఎత్తేస్తామని క్లారిటీ ఇవ్వలేదు. ప్రధాని రాష్ట్రాల్లోని సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని ఏం చేయాలో వారినే తేల్చుకోమన్నారు. ఒకవేళ ముందుగా ప్రకటించినట్లుగా ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ఎత్తేస్తే.. విమాన సర్వీసులు తిరగొచ్చు. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు పనిచేస్తే ఏప్రిల్ 14తర్వాత బుకింగ్స్ చేసుకోవచ్చని ఎయిర్ లైన్స్ ప్రకటించింది. (కరోనా పాజిటివ్ రావడంతో డాక్టర్ ఆత్మహత్య)

కానీ, ఏప్రిల్ 14తర్వాత లాక్ డౌన్ మళ్లీ పొడిగిస్తే టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఎయిరిండియా ఏప్రిల్ 30 తర్వాత బుకింగ్స్ మాత్రమే తీసుకుంటుంది. ఎయిర్ డెక్కన్ మాత్రం ఎటువంటి బుకింగ్స్ తీసుకోకుండా రీస్టార్ట్ ఆపరేషన్స్ ను ప్రకటించడానికి కాస్త సమయం పడుతుందని తెలిపింది. ఆర్థికపరంగా దెబ్బ తిన్నప్పటికీ ఇండిగో సీనియర్ సిటిజన్ల ముందు ఓ ఆఫర్ ఉంచింది. 

టిక్కెట్లలో 25 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని ప్రకటించింది. స్పైస్ జెట్ ఉద్యోగుల వేతనాల్లో 10 నుంచి 30 శాతం కోత విధిస్తుంటే ఎయిరిండియా మాత్రం 10 శాతం ఉద్యోగులకు వచ్చే ఎల్లోవెన్సుల నుంచి కట్ చేయనుంది. గో ఎయిర్ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు ఆపేసి.. పైలట్లకు జీతాలివ్వకుండానే సెలవులు ఇచ్చేసింది. మార్చి 25వరకూ దాదాపు విమాన సర్వీసుల్లో చాలా మంది సిబ్బంది సెలవుల్లోనే ఉంటారు. 

కార్గో విమానాలు, ఆఫ్‌షోర్ హెలికాప్టర్ ఆపరేషన్స్, ఎవాక్యుయేషన్ విమానాలు, ప్రత్యేక విమానాలు, ఇండియన్ ఏవియేషన్ నుంచి అనుమతి పొందిన ప్రత్యేక విమానాలు మాత్రమే లాక్ డౌన్ సమయంలో పనిచేస్తున్నాయి.