Goa Beach: గోవా బీచ్‌కు వెళ్తున్నారా? ఈ కొత్త రూల్స్ పాటించకుంటే జేబులకు చిల్లు తప్పదు ..

గోవా ప్రభుత్వం కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. గోవా బీచ్‌లో సన్‌ బాత్‌ చేస్తున్నప్పుడు, సముద్రంలో సరదాగా గడుపుతున్న వారి ఫొటోలు తీయడానికి ముందస్తుగా వారి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో వంట చేయడం కూడా నిషేధం. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారికి రూ.50 వేల వరకు జరిమానా విధించనున్నారు. బీచ్‌లో బహిరంగంగా మద్యం సేవించే వారిపైకూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది.

Goa Beach: గోవా బీచ్‌కు వెళ్తున్నారా? ఈ కొత్త రూల్స్ పాటించకుంటే జేబులకు చిల్లు తప్పదు ..

Goa Beach

Goa Beach: గోవా బీచ్‌కు వెళ్తున్నారా? అయితే మీరు తప్పనిసరిగా అక్కడి ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తెచ్చిన రూల్స్‌ను తెలుసుకోవాల్సిందే. బీచ్‌కు వెళ్లి అక్కడి రూల్స్ అతిక్రమిస్తే మీ జేబులకు వేలల్లో చిల్లు‌పడటం ఖాయం. గోవా ప్రభుత్వం తాజాగా పర్యాటకులకు కీలక సూచనలు జారీ చేసింది. ఆ ప్రాంతానికి వెళ్లే పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని ఉల్లంఘించిన వారికి అక్కడి అధికారులు వేలల్లో జరిమానాలు విధిస్తారు. ముఖ్యంగా బీచ్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాదు, బహిరంగ ప్రదేశంలో ఆహారాన్ని వండితే రూ. 50వేలు జరిమానా కట్టాల్సిందే.

Naked Man In Goa Beach : బాబోయ్.. నగ్నంగా బీచ్‌లో తిరుగుతున్న వ్యక్తి, వీడియో వైరల్

గోవా ప్రభుత్వం కొత్త రూల్స్‌లో పర్యాటకులు వేరేవారిని ఫొటోలు తీసేముందు వారి అనుమతి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బీచ్‌లో సేదతీరేవారు, సముద్రంలో సరదాగా గడిపే సమయంలో వారి అనుమతి లేకుండా ఫొటోలు తీయొద్దు. పర్యాటకులు రాళ్లు, ప్రమాదకరమైన ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోవద్దు. అంతేకాక, గోవాలోని చారిత్రక కట్టడాలను పాడుచేయొద్దని గోవా ప్రభుత్వం పర్యాటకులకు విజ్ఞప్తి చేసింది. గోవా వచ్చే పర్యాటకులు పర్యాటక శాఖలో రిజిస్టర్ చేయబడిన హోటల్స్ లోనే బస చేయాలని సూచించింది.

 

ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, బహిరంగ ప్రదేశాల్లో వంట చేసినా భారీగా జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం సూచించింది. జనవరి 26న పర్యాటకుల కోసం గోవా పర్యాటక శాఖ ఈ కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. గోవాలో పర్యటించే పర్యాటకులు ప్రతీఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. పర్యాటకుల గోప్యత, వారి భద్రత, మోసం నుంచి వారిని రక్షించడం వంటి ఉద్దేశంతోనే ఈ రూల్స్ అమల్లోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.