TATA : ఎయిరిండియాను నడపడం అంత సులువేమీ కాదు..కష్టాలుంటాయి

కొత్త యజమాని...సంస్థను నడపడం అంత సులువు ఏమీ కాదని, విమానాలను పునరుద్ధరించాలంటే..చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందన్నారు.

TATA : ఎయిరిండియాను నడపడం అంత సులువేమీ కాదు..కష్టాలుంటాయి

Tata

Air India – TATA : ఎయిరిండియాను నడపడం అంత సులవేమీ కాదు..కష్టాలుంటాయి..చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది..ఏడాది వరకు ఉద్యోగులను ముట్టుకోవడం సాధ్యం కాదు..అంటూ…దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే అన్నారు. అప్పుల్లో కూరుకపోయిన ఎయిరిండియా విమానయాన సంస్థ టాటాల పాలిట కామధేనువు ఏమీ కాదని చెప్పారు. ఎయిరిండియాను టాటా సంస్థ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..ఎయిరిండియాను కారు చౌకగా టాటాలకు అప్పచెప్పారని కాంగ్రెస్ పలు విమర్శలు గుప్పించింది.

Read More : Telangana : అలయ్ బలయ్, బండి సంజయ్‌తో మాట్లాడిన కవిత..ఫొటో వైరల్

దీంతో దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత్ స్పందించారు. కొత్త యజమాని…సంస్థను నడపడం అంత సులువు ఏమీ కాదని, విమానాలను పునరుద్ధరించాలంటే..చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఆ సంస్థకు ఏకైన ప్రయోజనం ఏంటంటే…సంస్థకు ఏళ్లుగా ఉన్న అప్పులను వారు తీసుకోవడం లేదని, కేవలం వారు నిర్వహించగల అప్పులను మాత్రమే తీసుకుంటున్నారని వెల్లడించారు.

Read More : Kerala : అయ్పప్ప భక్తులకు సూచనలు..తప్పకుండా పాటించాలి

ఎయిరిండియా అమ్మడం వల్ల…పెద్ద ఎత్తున పన్ను చెల్లింపు దారుల సొమ్ము ఆదా అయ్యిందన్నారు. దీనిని నడపడానికి ప్రస్తుతం రోజుకు రూ. 20 కోట్లు ప్రజల సొమ్మును చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం ఏడాది వరకు ఉద్యోగులున ముట్టుకొనే అవకాశమే లేదని, ఏడాది అనంతరం వీఆర్ఎస్ ఇవ్వడం కుదురుతుందని తుహిన్ కాంత్ పాండే అన్నారు. త్వరలోనే టాటాలకు ఎయిర్ ఇండియాను అప్పచెబుతామన్నారు.