PM Modi : అర్థవంతమైన చర్చకు ప్రభుత్వం సిద్ధమే..ఆఖిలపక్ష భేటీలో మోదీ

సోమవారం(జులై-19,2021)నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఇవాళ అఖిలపక్షం సమావేశమైంది.

PM Modi : అర్థవంతమైన చర్చకు ప్రభుత్వం సిద్ధమే..ఆఖిలపక్ష భేటీలో మోదీ

Modi (5)

PM Modi సోమవారం(జులై-19,2021)నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఇవాళ అఖిలపక్షం సమావేశమైంది. మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, రాజ్యసభలో అధికారపక్ష నేత పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి ప్రభుత్వం తరపున ఈ భేటీకి హాజరయ్యారు. కాంగ్రెస్ తరపున మల్లికార్జున ఖర్గే,అధిర్ రంజన్ చౌదరి పాల్గొన్నారు. టీఎంసీ,డీఎంకే,బీఎస్పీ,ఎల్జేపీ,ఆప్నాదళ్,ఎస్పీ సహా వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. మొత్తంగా 33 పార్టీల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను ప్రభుత్వం కోరింది. ఆరోగ్యకరమైన, అర్థవంతమైన చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని ప్రధాని మోదీ.. అఖిలపక్షానికి స్పష్టం చేసినట్లు భేటీ అనంతరం మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

కాగా, సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. కరోనా కారణంగా గత రెండు సమావేశాల్లో ఉభయ సభలు వేర్వేరు సమయాల్లో భేటీ కాగా.. ఈసారి ఒకే సమయానికి రెండు సభలు కార్యకలాపాలు సాగించనున్నాయి. ఎప్పటిలానే ఈసారీ ఉదయం 11 గంటలకు సభలు మొదలు కానున్నాయి. ఇక,ఈ వర్షకాల సమావేశాల్లోనే.. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు,ఇన్​సాల్వెన్సీ అండ్​ బ్యాంక్ ​రప్ట్సీ బిల్లు,గిరిజన సంస్కరణల బిల్లు వంటి వివిధ కీలక బిల్లులు ఆమోదించుకోవాలని మోదీ సర్కారు భావిస్తోంది. వివాదాస్పద జనాభా నియంత్రణ, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ప్రైవేట్ బిల్లులు సైతం పార్లమెంట్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ధరల పెరుగుదల, కరోనా నియంత్రణ వంటి పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి.