Rakesh Tikait : దేశంలోని పంటలను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న మోదీ సర్కార్!

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతన్నలు పిలుపునిచ్చిన 'భారత్​ బంద్​' ప్రశాంతంగా సాగుతోంది. అయితే 10 ఏళ్లు అయినా సరే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా

Rakesh Tikait : దేశంలోని పంటలను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న మోదీ సర్కార్!

Rakesh

Rakesh Tikait  నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతన్నలు పిలుపునిచ్చిన ‘భారత్​ బంద్​’ ప్రశాంతంగా సాగుతోంది. అయితే 10 ఏళ్లు అయినా సరే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని,కానీ ఆ చట్టాలు అమలు చేసేందుకు తాము అనుమతించమని భారతీయ కిసాన్ యూనియన్(BKU) లీడర్ రాకేష్ టికాయత్ మరోసారి పునరుద్ఘాటించారు. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేవరకు మరియు కనీస మద్దతు ధర(MSP)పైన ఓ చట్టం తీసుకొచ్చే వరకు రైతులు వెనుదిరిగి వెళ్లరని తాజాగా ఓ ఇంటర్వ్యూలో టికాయత్ సృష్టం చేశారు. భారత్ బంద్ చేపట్టడం వల్ల తాము ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించట్లేదని టికాయత్ అన్నారు. రోడ్డు మాసివేయబడలేదని పేర్కొన్నారు.

వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వంతో చర్చల కోసం రైతులు సిద్ధంగానే ఉన్నారన్నారు. అయితే,షరతులతో కూడిన చర్చలకు తాము ఒప్పుకోమన్నారు.ప్రభుత్వం తమతో ఎందుకు మాట్లాడటం లేదని టికాయత్ ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాతనే తాము ప్రభుత్వంతో మాట్లాడతామని తామెప్పుడూ చెప్పలేదన్నారు. చట్టాలను రద్దు చేయం..మీరు(రైతులు)మాట్లాడవచ్చు అని ప్రభుత్వం చెబుతోందన్నారు. చర్చలు ప్రారంభించాలని తాము ప్రభుత్వానికి చెబుతున్నామన్నారు. MSPపై గ్యారెంటీ కోసం ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురావాలని టికాయత్ తెలిపారు. ఓ రైతు తాను పండించిన పంటలో 50క్వింటాల్లను కూడా అమ్ముకోలేకపోతున్నాడని కానీ ఓ వ్యాపారవేత్త తనకు కావలసినంత అమ్ముకోగల్గుతున్నాడని అన్నారు.

ALSO READ ప్రియుడితో తిరుమలలో నయన్.. పెళ్లి పీటలెక్కుతారా?

దేశంలోని పంటలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం చూస్తోందన్నారు టికాయత్. అయితే రైతులు ఇది జరగనివ్వరని టికాయత్ సృష్టం చేశారు. విపక్షాల ఎజెండా ప్రకారమే రైతు సంఘాలు పనిచేస్తున్నాయనే ఆరోపణలను ఈ సందర్భంగా టికాయత్ కొట్టిపారేశారు. దేశంలో ఏదైనా ప్రతిపక్షం ఉందా అని ఆయన ప్రశ్నించారు. దేశపు రైతులు ప్రస్తుత సంక్షోభాన్ని ఎదర్కొని ఉండాల్సింది కాదన్నారు. ముఖ్యంగా పంజాబ్,హర్యానా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు ఏడాదిగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉన్నారన్నారు. కనీస మద్దతు ధర వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ఈ చట్టాలు తెచ్చిందని రైతులు దిగులుచెందుతున్నారన్నారు. అయితే,ఇవి పెద్ద వ్యవసాయ సంస్కరణల కోసం తెచ్చిన చట్టాలుగా ప్రభుత్వం చెప్పుకుంటోందన్నారు. కాగా,వ్యవసాయ చట్టాల విషయమై గతంలో రైతు సంఘాల నేతలు-ప్రభుత్వం మధ్య జరిగిన 10 రౌండ్లకు పైగా చర్చలు అసంపూర్తిగానే ముగిసిన విషయం తెలిసిందే.

ALSO READ భారత్ లోకి నిషేధిత డ్రగ్స్ అసలు ఎలా వస్తున్నాయో తెలుసా

ఇక,చెరుకు కొనుగోలు ధరను పెంచుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడాన్ని..రైతులపై వేసిన ఓ పెద్ద జోక్ గా అభివర్ణించారు టికాయత్. కాగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్..రాష్ట్రంలో చెరకు కొనుగోలు ధరను క్వింటాకు రూ.25 పెంచుతున్నామని..దీంతో క్వింటాల్ ధర రూ.350కి చేరుకుంటుందని యోగి ఆదిత్యానథ్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే క్వింటాకు 25 రూపాయలు పెంచడం రైతులకు ఆంగీకారం కాదని తెలిపారు.

ALSO READ  షుగర్ లెవల్స్ తగ్గించే మామిడాకులు…ఎలా ఉపయోగించాలో తెలుసా?..

మరోవైపు,రైతులు చేపట్టిన భారత్​ బంద్​ ప్రభావం ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపిస్తోంది. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ నిరసనకారులు రోడ్లు, రైల్వే ట్రాక్​లపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపుర్‌ లోనూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. కొత్త సాగు చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంద్​ కారణంగా దేశ రాజధాని భద్రతా వలయంలోకి జారుకుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఢిల్లీ- గురుగ్రామ్​ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక,పంజాబ్​, హర్యాణా,తమిళనాడు,కేరళ రాష్ట్రాల్లో కూడా రైతన్నకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కేరళలో సంపూర్ణ బంద్​ పాటిస్తున్నారు.