బ్యాంకు మోసాలకు ఇక చెక్, కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది

మీకు బ్యాంకు అకౌంట్, పేమెంట్స్, ఆధార్, కొవిడ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఓటీపీలు, ఇతర ఎస్ఎంఎస్ లు రావడం లేదా? అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. మరో 24 గంటల్లో ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఎప్పటిలానే బ్యాంకు ఓటీపీలు, ఎస్ఎంఎస్ లు వస్తాయి.

బ్యాంకు మోసాలకు ఇక చెక్, కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది

Govts New Measure Aimed To Cut Down SMS Spam: మీకు బ్యాంకు అకౌంట్, పేమెంట్స్, ఆధార్, కొవిడ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఓటీపీలు, ఇతర ఎస్ఎంఎస్ లు రావడం లేదా? అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. మరో 24 గంటల్లో ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఎప్పటిలానే బ్యాంకు ఓటీపీలు, ఎస్ఎంఎస్ లు వస్తాయి.

నిన్నటి(మార్చి 8,2021) నుంచి దేశవ్యాప్తంగా అనేక బ్యాంకింగ్ సేవలు, ఇతర అంశాలకు సంబంధించిన ఓటీపీలు, ఎస్ఎంఎస్ లు చాలామందికి స్థంభించిపోయాయి. దీనికి ప్రధాన కారణం ట్రాయ్(టెలికాం రెగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకురావడమే. ఇటీవల దేశవ్యాప్తంగా అవాంచిత ప్రమోషనల్ కాల్స్, ఫిషింగ్ కాల్స్, ఫేక్ మేసేజ్ లాంటివి పెరుగుతున్నాయి. అలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి కొత్త బ్లాక్ చైన్ టెక్నాలజీని అమలు చేయమని టెలికం కంపెనీలకు ట్రాయ్ 2019లో ఆదేశించింది.

అయితే, అప్పటి నుంచి అది పెండింగ్ లోనే ఉంది. తాజాగా కొత్త టెక్నాలజీని అప్ డేట్ చేయడం తప్పనిసరి కావడంతో సరికొత్త మార్పులను అమలు చేసే ప్రయత్నంలో టెలికం కంపెనీలు ఉన్నాయి. దీంతో ఓటీపీ, ఎస్ఎంఎస్ సేవలకు కొంత సమయం పాటు తీవ్ర అంతరాయం కలిగింది. కొత్త నిబంధనల ప్రకారం ఇక మీదట వినియోగదారులకు ఎస్ఎంఎస్ లు పంపించే కంపెనీలు, బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు కొన్ని మేసేజ్ టెంప్లెట్ లను తయారు చేసుకుని ఉండాలి. అందులో సూచించిన విధంగా మాత్రమే వినియోగదారులకు మేసేజ్ లు పంపాల్సి ఉంటుంది.