మధుర క్షణాలు : మనుమరాలికి ఆట నేర్పిస్తున్న బామ్మ..

మధుర క్షణాలు : మనుమరాలికి ఆట నేర్పిస్తున్న బామ్మ..

మనకు ఎంత వయస్సు వచ్చినా..చిన్నప్పుడు బామ్మా.. తాత‌య్య‌లతో ఆడుకున్న ఆటలు మధుర జ్ఞాపకాల్లా మిగిలిపోతాయి. ఆ పాత మధురాలు మళ్లీ తిరిగి రావు. అటువంటి మ‌ధుర‌మైన క్ష‌ణాలు చాలా ఆనందాన్నిస్తాయి. బాల్యంలో అటువంటి ఆటలు..పాటలు గుర్తుతెచ్చుకుని ఆనందం పొందటమే తప్ప మళ్లీ తిరిగి అటువంటి వయస్సుకు వెళ్లలేం. కానీ ఈ నాటి పోటీ ప్రపంచంలోను..బిజీబిజీలైఫ్ ల్లో నేటి పిల్లలు బామ్మ..తాతయ్యల దగ్గర పెరిగే అవకాశాలను కూడా కోల్పోతున్నారు. కానీ అటువంటి అనుభూతులు ప్రతీ చిన్నారులకు ఉండాలి.

అలా ఆడుకుని పెరిగిన చాలామంది కూడా తమ పిల్లలకుఅటువంటి అనుభూతులను ఇవ్వాలని ఉన్నా ప్రస్తుత జీవనశైలిలో అవి సాధ్యంకావటంలేదు.  కానీ ప్రతీ చిన్నారికి అటువంటి మధుర క్షణాలను ఆస్వాదించాల్సిన అవసరం చాలా ఉంది. అటువంటి అకాశాలను తమ పిల్లలకుఇవ్వాలని కోరుతూ..అటువంటి అపురూపమైన..విలువైన స‌మ‌యాన్ని గ‌డ‌పాలంటూ ట్విట‌ర్ యూజ‌ర్ రాజ్ ఒక వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. దాదాపు రెండు నిమిషాల పాటు న‌డిచే ఈ వీడియో నెటిజన్లు ఎంతగానో ఆక‌ట్టుకుంటోంది.

ఒక బామ్మగారు..తన మన‌ుమరాలితో కలిసి గచ్చకాయల ఆట ఆడుతోంది. ఈ ఆట‌ను కొంత‌మంది అచ్చనగండ్లు, అచ్చనగాయలుగా అని అంటారు. ఆ అమ్మ‌మ్మ ఆడుతుంటే మ‌న‌వ‌రాలు కిలకిలా నవ్వుతూ చూస్తోంది. బామ్మ చేయి ఎంత చాకచక్యంగా కదులుతోందో ఆసక్తిగా చూస్తోంది. ఈ అందమైన..అపురూపమైన వీడియోని ఇప్ప‌టివ‌ర‌కు 21 వేల‌కు పైగా లైక్స్ వచ్చాయి. అంతేకాదు 349K మంది చూశారు.

‘లవ్లీ. నేను నా నానితో ఆడాను. నా కొడుకుతో మళ్లీ ఆడాలని నాకు గుర్తు చేసింది’  అని నెటిజన్లు కామెంట్ల పెడుతున్నారు.ఈ వీడియో చూస్తే తమ చిన్ననాటి జ్ఞాపకాలు తట్టిలేపుతున్నాయని అనుకోకతప్పదు. మా పిల్లలకు కూడా ఇటువంటి అనుభూతులను ఇస్తామని అనకాతప్పదు. మరి మీరు కూడా చూసేయండి ఈ బామ్మా..మనుమరాళ్లు ఆట..

Read:  వాటే ఐడియా సర్ జీ : చేయి చాపండి..గుళ్లో..తీర్థం పోస్తున్న మెషిన్